Breaking News

గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు

-ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో గంజాయి సాగుచేయకుండా గట్టి నిఘా ఏర్పాటు
-నియంత్రణకు ప్రత్యేక టాస్కు ఫోర్సు ఏర్పాటు
-పాఠశాలలు,కళాశాలల ప్రాంగణాల్లో ప్రత్యేక నిఘా,విద్యార్ధుల ప్రవర్తణలో మార్పుకు కృషి
-డీ-అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక దృష్టి సారించాం
-గిరిజన ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో జీవనోపాధి పంటల సాగుకు ప్రోత్సాహం
-గంజాయి,ఇతర మత్తు పదార్ధాల సేవనం నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పన
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం, నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం ఢిల్లీలో నార్కో-కో ఆర్డినేషన్ సెంటర్(NCORD) 7వ అపెక్స్ లెవెల్ సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాల సిఎస్ లు, డిజిపిలు,ఇతర అధికారులు వర్చువల్ గా ఈసమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆపరేషన్ పరివర్తన పేరిట గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రా-ఒడిస్సా సరిహద్దుల్లో గిరిజనులు గంజాయి సాగు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నియంత్రణకు సంబంధించి ప్రత్యేక టాస్కు ఫోర్సును ఏర్పాటు చేయడంతో పాటు పెద్దఎత్తున చెక్కు పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని కేంద్ర హోంమంత్రికి వివరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల సేవనం నిషేధానికి సంబంధించి వివిధ పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్ధుల్లో ప్రవర్తనలో మార్పలు తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. అదే విధంగా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను సరఫరా చేసే వారిపై గట్టి నిఘా ఉంచడం జరిగిందని ఇందుకై ప్రత్యేక టాస్కు ఫోర్సును ఏర్పాటు చేశామని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు.
గిరిజన మారుమూల ప్రాంతాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టా భూముల్లో గిరిజనులు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నయ జీవనోపాధి కల్పించే పంటలు పండించే విధంగా చైతన్యం తీసుకురావడంతో పాటు కాఫీ, రాగి, నిమ్మ, నారింజ వంటి విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు.గంజాయి,ఇతర మత్తు మందుల నియంత్రణను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్ల అధ్యక్షతన రాష్ట్ర,జిల్లా స్థాయి నకోర్డు (NOCORD)కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గంజాయి,ఇతర మత్తు పదార్ధాల సేవనం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకువచ్చేందుకు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారాను, పాఠశాలలు,కళాశాలల్లో పెద్దఎత్తున అవగాహనా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వివరించారు.
అంతకు ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ నుండి వీడియో సమావేశం ద్వారా మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వివిధ పాఠశాలలు,కళాశాలలు,వసతి గృహాల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల్లో వ్యక్తిగత పరివర్తనలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో సిఎస్,డిజిపిలు,జిల్లా స్థాయిలో కలక్టర్,ఎస్పిలు గంజాయి,ఇతర మాదక ద్రవ్యాల సరఫరా నియంత్రణపై నిరంతరం పర్యవేక్షించడంతో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఇందుకుగాను వివిధ సంఘాలు, సంస్థలను దీనిలో పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని చెప్పారు. అంతకు ముందు మారక ద్రవ్యాలకు సంబంధించి 14446 నంబరుతో కూడిన నేషనల్ డీ-అడికషన్ హెల్ప్ లైన్ కేంద్రాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంచనంగా ప్రారంభించారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్  కుమార్ భల్లా వీడియో సమావేశంలో మాట్లాడుతూ డ్రగ్స్ రహిత భారతదేశం లక్ష్యంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు, సరఫరా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఇందులో భాగంగా ప్రజల్లో విస్తృత అవగాహనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.ఇందుకుగాను బ్రహ్మకుమారీలు, ఆర్ట్ ఆఫ్ లివింగ్,ఇస్కాన్ వంటి పలు ఆధ్యాత్మిక సంస్థలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చు కోవడం జరిగిందని వివరించారు. పలు కేంద్ర కారాగారాల్లో డి-అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఎక్ భల్లా పేర్కొన్నారు.
ఈ వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణ బాబు, పిసిసిఎఫ్‌ చిరంజీవి చౌదరి, సిఐడి అదనపు డిజిపి రవిశంకర్ అయ్యన్నార్,హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సెబ్ డిఐజి యం.రవి ప్రకాశ్, డియంఇ డా.నర్సింహం ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *