Breaking News

రాష్ట్రంలో విలేకరులందరికి విజయ సాయి రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

-విజయసాయి రెడ్డిని రాజ్యసభ సభ్యత్వంగా రద్దు చేయాలి
-ఆంద్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో విలేకరుల పట్ల అమర్యాదపూర్వకంగా మాట్లాడిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విలేకరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆంద్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చిట్టినగర్ లోని ఏ పి ఎమ్ పి ఏ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో విజయసాయి రెడ్డి నోటి దూల తగ్గించుకోవాలని హెచ్చరించారు. అక్షరం ముక్క రాని నిశానిలే ఎంతో మర్యాదగా మాట్లాడుకునే ఈ రోజుల్లో రాజ్యసభ సభ్యులు అనే విషయాన్ని విస్మరించి డబ్బు మదంతో విర్రవేగుతున్న విజయసాయి రెడ్డి మునుముందు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఏ పి ఎమ్ పి ఏ నాయకులు హెచ్చరించారు.
ప్రపంచంలో భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ కి ప్రత్యేక స్థానం ఉంది. కానీ మనదేశంలో రాజ్యసభ సభ్యులు దిగజారుడు వ్యాఖ్యలతో మన ప్రజాస్వామ్య వ్యవస్థని కించపరిచే విధంగా రాజ్యసభ సభ్యులు నోరు పారేసుకోవడం పట్ల సభ్యత్వం రద్దు చేయాలని, ఆంద్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు .లేదా స్వచ్ఛందంగా రాజ్యసభ సభ్యత్వం కి విజయసాయి రెడ్డి రాజీనామా చేయాలని హితవు పలికారు. విజయసాయి రెడ్డి నిజంగా నీతి పరుడని నిరూపించు కొని ప్రత్యర్ధులు డిమాండ్ మేరకు డి ఎన్ ఏ పరీక్షలకు సిద్ధంగా కావాలని లేదా విలేకరులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఏ పి ఎమ్ పి ఏ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకట రమణ, విజయవాడ నగర అధ్యక్షులు తాళ్లూరు అనిల్ కుమార్, నగర కార్యదర్శి గుర్రం శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు కోటా రాజా, సంయుక్త కార్యదర్శి మానేపల్లి మల్లిఖార్జునరావు, కార్యనిర్వాహక కార్యదర్శి నాగోతి శ్రీనివాసరావు (ఎన్ ఎస్ ఆర్), నాయకులు పెట్లూరి కుమార్, రాచాబత్తుని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *