Breaking News

పెండింగ్ భూ సేకరణ, పరిహార పంపిణీ సమస్యల పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ చొరవతో ప్రభుత్వానికి నివేదికలు

-తమ్మిన పట్నం, కొత్త పట్నం భూ సేకరణ పెండింగ్, పరిహార పంపిణీ అంశాలపై గ్రామ సభ నిర్వహించి రైతులతో ముఖాముఖి చర్చించిన కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్
-గూడూరు నియోజక వర్గ పరిధిలో జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సుడిగాలి పర్యటన

గూడూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తమ్మిన పట్నం, కొత్త పట్నం భూ సేకరణ, పరిహార పంపిణీ తదితర పెండింగ్ అంశాలపై జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ చొరవ తీసుకుని స్వయంగా సందర్శించి గ్రామ సభ నిర్వహించి రైతులతో ముఖాముఖి చర్చించి ప్రభుత్వానికి నివేదించి పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజలు ఓపికగా సహృదయంతో సహకరించాలని కోరారు.

శుక్రవారం మధ్యాహ్నం కోట, చిల్లకూరు మండల పరిధిలోని తమ్మిన పట్నం, కొత్త పట్నం తదితర గ్రామాల పరిధిలోని ఏపీఐఐసి క్రిసిటీ ప్రాజెక్టుకు సంబంధించిన చెన్నై బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ నోడ్ (సీబీఐసి) సంబంధించిన భూ సేకరణ, పరిహార అంశాలపై ప్రభుత్వ భూమి, డికేటి పట్టాలు, ఎలాంటి రికార్డు లేకుండా ప్రభుత్వ భూమిలో అనుభవంలో ఉన్న రైతులతో గ్రామ సభ నిర్వహించి ముఖాముఖిగా చర్చించి పరిష్కార దిశగా రైతులకు పలు అంశాలపై వివరిస్తూ ప్రభుత్వానికి నివేదించి తదుపరి చర్యలు చేపడుతామని తిరుపతి జిల్లా కలెక్టర్ తెలిపారు. గతంలో పలువురు అధికారులు ఈ ప్రాంతాలను సందర్శించి చర్యలు తీసుకోవడం జరిగిందనీ ఇంకా పెండింగ్ అంశాలను తెలుసుకుని వాటి పరిష్కార దిశగా చర్యల కొరకు తాను రావడం జరిగిందనీ తెలిపారు. పట్టా భూమి, డికెటి భూములకు సంబంధించి వెబ్ లాండ్ నందు ఏపీఐఐసి అని నమోదు అయిన వాటికి రైతుల వద్ద ఉన్న ఆధారాల రికార్డుల మేరకు అర్హత ఉన్నవారికి నష్ట పరిహారం కు రికమెండ్ చేయడం జరుగుతుందని, అలాగే ప్రభుత్వ భూమిలో రైతులు ఎన్నో ఏళ్లుగా అనుభవంలో ఉన్న రైతులకు సంబంధించి వారు ఎన్ని సంవత్సరాలుగా అనుభవంలో ఉన్నారో, ఎంత విస్తీర్ణంలో, ఎంత పెట్టుబడి పెట్టారని 10 టీమ్ లు ఏర్పాటు చేసి సర్వే చేయించాలని సదరు ప్రక్రియ మంగళవారం తమ్మిన పట్నం నందు బుధవారం కొత్త పట్నం, సిద్ధవటం నందు చేపట్టాలని ఆర్డీఓ గూడూరు వారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ క్యాంపు నందు రెవెన్యూ, ఏపీఐఐసి తదితర అధికారులు పాల్గొని పది రోజుల్లో సర్వే పూర్తి చేసి వివరాలు సక్రమంగా నమోదుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. సాగరమాల కింద రోడ్డు వేస్తున్న నడవ వారిపల్లి గ్రామ పరిధిలో సుమారు పది ఎకరాల పైన ప్రభుత్వ భూమిని అనుభవంలో సాగు చేసుకుంటున్న రైతులకు నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని, తమ్మిన పట్నం మెయిన్ వద్ద ప్రదేశం కండలేరు నీటి ప్రవాహం కోతకు గురైందని, ఎస్టీ కాలనిలోకి తరచుగా వరద ప్రవాహం వస్తోందని దానికి సంబంధించి రివిట్మెంట్ వాల్ ఏర్పాటు కొరకు అంచనాలు పూర్తి అయ్యాయని నిధులు రాలేదని రైతులు, గ్రామస్థులు తెలుపగా కలెక్టర్ దానిపై పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పలువురు లేవనెత్తిన ఇంటి స్థలాలు పోసెషన్ పై డైరెక్టర్ పోర్ట్స్ వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు.రైతులు పొలాల్లో వేసుకున్న వేరుసెనగ పంటను కలెక్టర్ పరిశీలించారు. కోట మండలం కొత్త పట్నం నందు గ్రామస్థులు తెలిపిన అంశాలపై మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత పరిశ్రమల స్థాపన తో పాటు ప్రజల సంక్షేమం కూడా ప్రాధాన్యతా ఉందని తెలిపారు. జిందాల్ పవర్ వారితో మాట్లాడి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా వారు సదరు గ్రామాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి ఏర్పాటుకు చర్చించానని, స్థానికులకు కనీస వేతనాలు కల్పించేలా వారితో మాట్లాడటం జరిగిందనీ తెలిపారు. ఏపీఐఐసి అధికారులు ప్రభుత్వ ప్రతినిధులు అని తెలిపారు. వాస్తవ పరిస్థితిని స్వయంగా పరిశీలించాను అని సదరు వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తానని తెలిపారు. గమనించాల్సిన విషయం ఏమంటే 2012 వ సంవత్సరం జీఓ 571 మేరకు పది సంవత్సరాలు, ఆ పైన రైతు సాగులో ఉండి ప్రభుత్వం వారి నుండి భూమిని తీసుకుంటే నష్ట పరిహారం అందించేలా ఉత్తర్వులు ఉన్నాయని, సదరు సీబీఐసి కొరకు 2012 కు ముందు రైతులు సాగులో ఉన్న ప్రభుత్వ, డికేటి భూములకు సంబంధించిన అంశాన్ని ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు.

ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి సహకరించాలని, పెండింగ్ గా ఉన్న ఈ సమస్యను పరిష్కారం కొరకు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్థానిక గూడూరు ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వ ఆకాంక్షల మేరకు పారిశ్రామిక అభివృద్ధికి, నిరుద్యోగ యువతకు వివిధ పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా జాబ్ మేళా త్వరలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. రానున్న పది రోజుల్లో వివిధ పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి జిల్లాలోని స్థానిక యువతకు ఉపాధి కొరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్బంగా ఆర్డీఓ గూడూరు కిరణ్ కుమార్ రైతులకు భూసేకరణ, పరిహార పంపిణీ పెండింగ్ అంశాలపై వివరించారు.

ఈ కార్యక్రమంలో జోనల్ మేనేజర్ ఏపీఐఐసి చంద్రశేఖర్, తిరుపతి స్పెషల్ ఎకనామిక్ జోన్ జోనల్ మేనేజర్ విజయ రత్నం, సంబంధిత తాసిల్దర్లు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *