Breaking News

ఓమర్‌ జాతి పావురాలను కాపాడుకుందాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పావురాలు పెంచే ప్రియులలో ఓమర్‌ జాతి గురించి తెలియని వారు లేరనడంలో సందేహం లేదు. ఎందుకంటే అలనాటి రాజులకాలంలో ఏదైనా సమాచారం తెలియజేయాలంటే ఈ జాతి పావురాల ద్వారానే చేరవేయడం సాధ్యమయ్యేది. అంత ప్రత్యేకత వున్న జాతి ఓమర్‌ జాతిని కాపాడుకుందాం…అభివృద్ధి చేద్దామంటూ పిలుపునిస్తూ తమ ఎపి హోమింగ్‌ ఫీజియన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ద్వారా కృషి చేస్తున్నట్లు అసోసియేషన్‌ నాయకులు యలమంచిలి వెంకటరమణ తెలిపారు. ఈనెల 21వ (ఆదివారం) తేదీన కె.ఎల్‌.యూనివర్శిటీ ఆడిటోరియంలో ఎపి హోమింగ్‌ ఫీజియన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ద్వారా కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి పావురాల ప్రియులందరూ ఆహ్వానితులేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాము పెంచిన పావురాలను సుమారు 200 నుండి 1000 కిలోమీటర్ల దూరంలో వదిలిపెడతారు. అలా వదిలిన పావురాలు తిరిగి తాము పెంచిన వారి దగ్గరే ఏ పావురం ముందు వస్తే ఆ పావురాన్నే విజేతగా నిర్ణయిస్తామన్నారు. దీనిలో మొదటి, రెండవ, మూడవ బహుమతులు వుంటాయని తెలిపారు. సుమారు 21 అసోసియేషన్స్‌ ఒక ఫెడరేషన్‌ ఏర్పడి సుమారు 4 సంవత్సరాల కాలంలో ఇది రెండవ కార్యక్రమన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తమిళనాడు నుండి ఆర్‌.ఆర్‌.ప్రసాద్‌, పళని అప్పన్‌, కరాటే ఈశ్వర్‌, సత్యా, ఉదయ్‌కుమార్‌, ధన్‌సింగ్‌ తదితరులు, హైదరాబాద్‌ నుండి డాక్టర్‌ షాకీర్‌ నోమన్‌, పాండిచ్చేరి నుండి రాజేష్‌, బెంగుళూరు నుండి మంజూయాద్‌, రవి మొదలగువారు విచ్చేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌ రావు నారాయణబాబు, మాషుక్‌ రోషన్‌, వై.వి.రమణ, శివ కార్యక్రమ నిర్వాహకులు వ్యవహరిస్తారన్నారు. శాంతి చిహ్నమైన పావురాల జాతి కాపాడుదాం…ఓమర్‌ జాతి పావురాన్ని అభివృద్ధి చేద్దాం…అని అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *