Breaking News

పొందూరు ఖాదీపై వీడియో పోటీలు

-ఏపీ చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో పోటీల నిర్వహణ
-వీడియోల సమర్పణకు ఆగష్టు 1వ తేదీ ఆఖరు
– కె. శ్రీకాంత్ ప్రభాకర్, ఏపీ చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగష్టు 7న పొందూరు ఖాదీపై వీడియో పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ కె. శ్రీకాంత్ ప్రభాకర్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ప్రజల్లో చైతన్యం రగిలించడమే కాక స్వదేశీ వస్తు ఉద్యమంలో కూడా చేనేత వస్త్ర ఉత్పత్తి కీలక పాత్ర పోషించిందన్నారు. మహాత్మా గాంధీని ఎంతగానో ప్రభావితం చేసిన పొందూరు ఖాదీ వస్త్రాలు శ్రీకాకుళంనకు 25కి.మీ.ల దూరంలోని పొందూరు గ్రామంలో తయారు కాబడి నేటికీ ప్రసిద్ధి పొందుతున్నాయన్నారు. అందులో భాగంగా భారతీయ చరిత్రలో చేనేత యొక్క ప్రాధాన్యతకు గుర్తింపుగా 2015 నుంచి ప్రతి ఏటా ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు.
పొందూరు ఖాదీపై వీడియో పోటీలు..
ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పొందూరు ఖాదీ తయారీపై ‘వీడియో’ పోటీలు నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీలో పాల్గొనదలచినవారు పొందూరు ఖాదీ వస్త్ర తయారీలోని అన్ని దశలను పొందుపరుస్తూ చక్కటి వీడియోను రూపొందించాలన్నారు. ఉత్తమ వీడియోకు నగదు పారితోషకం మరియు ప్రశంసా పత్రం అందించి ఘనంగా సత్కరించడం జరుగుతుందని తెలిపారు. ఉత్సాహవంతులైన వారు ఇతర వివరాలకు పి.శ్రీనివాసరెడ్డి, సహాయ సంచాలకులు, ఫోన్ నెం. 9492344466, కమిషనర్ కార్యాలయం, చేనేత మరియు జౌళి శాఖ, 4వ అంతస్తు, ఐహెచ్‌సి కార్పోరేట్ బిల్డింగ్, మంగళగిరి, గుంటూరు జిల్లా వారిని 2024 జులై 26 తేదీ లోగా సంప్రదించి తమ వీడియోలను ఆగష్టు 1వ తేదీలోగా సమర్పించాలని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ కె. శ్రీకాంత్ ప్రభాకర్ అన్నారు.

 

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *