Breaking News

స్కిల్ హబ్ లో శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు మరియు విద్యార్థులకు ఇప్పటికే వివిధ రకాల ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కోర్సుల ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్. పి. నరేష్ కుమార్ మాట్లాడుతూ, ఈ శిక్షణలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మన విజయవాడలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో ఉన్నటువంటి స్కిల్ హబ్ లో ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్స్ నాల్గవ బ్యాచ్ ను, మరియు డిజిటల్ మార్కెటింగ్ మూడవ బ్యాచ్ ను ప్రారంభించడం జరుగుతుందని మరియు ఆ కోర్సును జూలై నెలలో ప్రారంభిస్తున్నట్లు తెలియపరిచారు. ఈ కోర్స్ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరి తేది 26/07/2024 అని డాక్టర్. పి. నరేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి వనరులు మరియు బహుళ జాతి కంపెనీ లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకొని యువతకి డిమాండ్ ఉన్నటువంటి కోర్సులో మూడు నెలల పాటు నైపుణ్య శిక్షణ కల్పించి వారిని స్థానికంగా మరియు ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి కంపెనీలో ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. కావున జిల్లాలోని ఆసక్తి ఉన్నటువంటి యువతీ యువకులు ఈ కోర్సు కొరకు వారి విద్యార్హతను బట్టి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరారు.

అర్హత: ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ (8th to 10th , ITI, Intermediate, Diploma and Any Degree), డిజిటల్ మార్కెటింగ్ (Intermediate to Any Degree).
సంపద్రించవలసిన నంబర్స్: 9985759304, 8008742842, 9347779032

ఉత్సా హవంతులైన అభ్యర్ధులు https://forms.gle/RfUQjn9yVTKLTFTcA లింక్ పైక్లిక్ చేసిరిజిస్టర్ చేసుకొనగలరు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *