Breaking News

ఆయిల్ ఫామ్ మెగా మేళా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఆయిల్ పామ్ తోటల సాగు వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని రైతులకు తెలియజేసి వారిని ఆ దిశగా మొగ్గు చూపేలా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. శనివారం ఉదయం అవనిగడ్డ ఎంపీడీవో కార్యాలయంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మెగా మేళా – ఆయిల్ ఫామ్ సాగుపై గ్రామస్థాయి ఉద్యాన, వ్యవసాయ శాఖల సహాయ సిబ్బందికి, రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ సాగు చేయుట కోసం రైతులకు ఎన్నో ప్రయోజనాలు అందిస్తోందన్నారు. జిల్లా యంత్రాంగం కూడా ఆయిల్ పామ్ తోటల సాగు పట్ల చాలా శ్రద్ధ వహిస్తోందన్నారు. రైతులకు మంచి ఆదాయం లభించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామాల్లో సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ సహాయకులు ఆయిల్ పా తోటల సాగువలన రైతులకు కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. రైతులకు సాధారణంగా విత్తనాలు, ఎరువులు ఎంపీకలో, సాగు చేయడంలో, ప్రకృతి వైపరీత్యాలు వలన కొంత నష్టం వాటిల్లుతూ ఉంటుందన్నారు. ఆయిల్ పామ్ తోటలు సాగు చేయుటకు ఎక్కువగా సదుపాయాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువగా లాభాలు పొందవచ్చన్నారు. ప్రభుత్వం నూటికి నూరు శాతం సబ్సిడీ అందజేస్తుందని మంచి మొక్కలను ఎంపిక చేసుకొని సాగు చేసెలా రైతులను ప్రోత్సహించాలన్నారు. తుఫాను, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వలన ఆయిల్ పామ్ పంటకు నష్టం జరగదన్నారు. బిందు, తుంపర్ల సేద్యం వంటి సూక్ష్మ సేద్యాల వలన నీటి అవసరం కూడా తక్కువ ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రభుత్వమే ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.

ఆయిల్ పామ్ తోటల సాగులో అంతర పంటలు కూడా వేసుకోవచ్చన్నారు. మొదటి నాలుగు సంవత్సరాలు పెద్దగా ఆదాయం రాదని ఆ తరువాత నుండి 40 సంవత్సరాల వరకు దిగుబడి, ఆదాయము ఉంటుందన్నారు. ఎరువులు, కలుపు మొక్కల తొలగింపు వంటి పంట నిర్వహణ కోసం కూడా హెక్టారుకు 5,625 రూపాయలను ప్రభుత్వమే అందిస్తుందన్నారు.

ఆయిల్ పామ్ చట్టం ఉందని దాని ప్రకారం మార్కెట్లో ధర నిర్ణయించడం జరుగుతుందని, వివిధ కంపెనీలు అంగీకారం తో వారే మొక్కలు సరఫరా చేయడంతో పాటు సేకరణ కేంద్రాల ద్వారా గెలలు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఎనిమిది సంవత్సరాల తర్వాత హెక్టారుకు 8 టన్నుల దిగుబడి వస్తుందని, 15 రోజులకు ఒకసారి గెలలు కోతకోయవచ్చని 50వేల రూపాయలు మిగులు ఉంటుందన్నారు. జిల్లాలో గన్నవరం ప్రాంతంలో ఇప్పటికే ఆయిల్ పామ్ విజయవంతంగా సాగు చేస్తూ రైతులు లాభాల బాట పట్టారన్నారు. జిల్లాలోని రైతులు ఆయిల్ పామ్ తోటల సాగు పట్ల దృష్టి సారించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. సిబ్బంది సరైన అవగాహన చేసుకుని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. వంటలు సాగు చేయడంలో రైతులకు కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలన్నారు. ఉద్యోగ జీవితంలో ఇటువంటి సేవలు అందించడం ద్వారా వారికి చెప్పుకోదగ్గ గుర్తింపు ఉంటుందన్నారు.

అంతకుమునుపు జిల్లా ఉద్యాన అధికారి జె జ్యోతి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త మంజువాణి ఎంపిక చేసుకోవలసిన భూమి, ఆరోగ్యకరమైన మొక్కలు, వనరులు, ప్రభుత్వ సహాయము, ఆయిల్ పామ్ తోటల పెంపకం ఎలా చేయాలి, తెలుసుకోవాల్సిన మెలకువలు లాభాలు తదితర అంశాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుంగల సుమతి, ఏపీఎంఐపి పిడి విజయలక్ష్మి, ఎంపీడీవో మరియాదేవమ్మ, తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు, ఉద్యాన వ్యవసాయ శాఖల సహాయక సిబ్బంది, వివిధ ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *