Breaking News

అన్నదేవర పేట గ్రామంలో కలెక్టర్ , సబ్ కలెక్టర్ పర్యటన

-వరద తీవ్రత కు అనుగుణంగా పునరావాస కేంద్రాల నిర్వహణ సిద్ధంగా ఉండాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి

తాళ్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు కు గురి అయ్యే ప్రాంతాల్లో ఉన్న వారిని ముందుగా గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. ఆదివారం ఉదయం తాళ్లపూడి మండలం అన్నదేవర పేట గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి . ప్రశాంతి గోదావరి బండ ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. గోదావరి నదికి పైనుంచి వస్తున్న వర్షపు నీరు వలన కొవ్వాడ కాలువ ద్వారా తాళ్లపూడి మండలంలో ముంపు గురి అయ్యే ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి అక్కడ తగిన భద్రతా చర్యలను చేపట్టాలని సూచించారు. జాన్ పేటలోని ముంపుగురి అయ్యే ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్ కు అక్కడ 50 కుటుంబాలు ఉన్నట్లు స్ధానికులు వివరించారు. వరద ముంపు వలన ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని ముందస్తుగా వృద్ధులను చిన్నారులను గర్భిణీలను గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ గోదావరి నదీ ప్రవాహ తీవ్రత కు అనుగుణంగా మండల స్థాయి అధికారులు చర్యలకు ఉపక్రమించాల్సి ఉంటుందన్నారు. స్థానికంగా ఎంపిపి హై స్కూలు లో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు కలెక్టర్ కి వివరించారు. గోదావరి బండ పరివాహక ప్రాంతాలు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పై పంచాయతీ అధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని , ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సంప్రదించి రక్షిత మంచినీరు అందుబాటులో ఉంచాలని, అవసరమైన మేరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువు గ్రామస్తులతో కలెక్టర్ ప్రశాంతి మాట్లాడి ప్రతిసారి గోదావరి వరదలు వచ్చే సందర్భంలో ప్రజలు తీసుకునే పలు అంశాలపై మాట్లాడడం జరిగింది. గోదావరి ఉధృతిని అనుసరించి అధికారులు సూచనలను పాటించి పునరావాస కేంద్రాలకు స్వచ్ఛందంగా తరలిరావాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, జిల్లా పంచాయతీ అధికారి డి రాంబాబు, తాహాసిల్దారు శ్రీనివాసరావు ఎంపీడీవో టీవీవి రమణ, స్థానిక నాయకులు అల్లూరి విక్రమాదిత్య, ఇరిగేషన్ అధికారులు, సచివాలయ గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *