Breaking News

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిపై కేంద్ర టూరిజం మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్ తో చర్చించిన…

-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యాటక రంగ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి కేంద్ర టూరిజం మంత్రి  గజేంద్ర సింగ్ షెకావత్ కలవడం జరిగిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.  ఆదివారం మంత్రి కందుల దుర్గేష్…ఢిల్లీ లో కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను మర్యాదపూర్వకంగా కలసి రాష్ట్రంలోని పర్యాటక ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి పలు ప్రాజెక్టుల చేపట్టేందుకు గాను పర్యాటకులను ఆకర్షించే విధంగా మంచి అనువైన ప్రదేశాలు ఉన్నాయని, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఆర్థిక ప్రగతిలో పర్యాటక రంగం ప్రాధాన్యం పెరిగి  అత్యంత వేగంగా అభివృద్ధి చెందడమే కాకుండా , విస్తృతంగా యువతకు ఉపాధి అవకాశాలను లభిస్తాయన్నాని ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్ట్స్ అభివృద్ధి కై నిధులు మంజూరు చేయవలసిందిగా కోరడం జరిగిందన్నారు. ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సెషన్స్ అయిన తరువాత మరొకసారి సమావేశమై టూరిజం ప్రాజెక్టులపై కులంకుషం గా చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామన్నారు. రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొనివచ్చి టూరిజం పరంగా రాష్ట్రన్ని అభివృద్ధి పథంలో నడిచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ .. కేంద్ర టూరిజం మంత్రి గజేంద్ర శకావత్ ను సన్మానించి, వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *