Breaking News

ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో నిడదవోలు మండలం లో విస్తృత పర్యటన

-మత్స్య శాఖ 2 బోట్లు, అగ్ని మాపక ఒక బోటు ద్వారా రెస్క్యూ ఆపరేషన్
-వరద ముంపు గ్రామాల్లో ప్రాథమిక అంచనాలలో భాగంగా పంట పొలాలకు పూర్తిగా నష్టం వాటిల్లినట్లు గుర్తించాం
-పునరావాస కేంద్రంలో భోజన ఏర్పాట్ల పరిశీలన
-ఆర్ వి రమణ నాయక్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎర్రకాలువ వలన నిడదవోలు మండలం పరిధిలో ముంపుకు గురైన పలు గ్రామాలను పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని , పునరావాస కేంద్రంలో ఆహారం అందించడం జరిగిందని నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్వి రమణ నాయక్, మండల స్పెషల్ ఆఫీసర్ ఏ దుర్గేష్ లు తెలియజేశారు. ఆదివారం నిడదవోలు మండలంలో నందమూరి అక్వీడిట్, సెట్టిపేట , తాల్లపాలెం, తిమ్మరాజు పాలెం గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్ వి రమణ నాయక్ వివరాలు తెలియ చేస్తూ, కలెక్టర్ ఆదేశాల మేరకు మండల స్పెషల్ అధికారి, తహశీల్దార్ ఇతర సమన్వయ అధికారులతో కలిసి ముంపు ప్రాంతాలలో పర్యటించడం జరిగిందన్నారు. సెట్టిపేట గ్రామంలో నీట మునిగిన గృహాలను సందర్శించి, వారందరినీ పునరావాస కేంద్రాలకు రావాలని కోరడం జరిగిందన్నారు. గ్రామంలోని సుమారు 500 మందికీ స్థానిక ఎంపిపి స్కూలు లో భోజన సదుపాయాలూ కల్పించినట్లు తెలిపారు. అదనంగా పునరావాస కేంద్రాలకు వొచ్చే వారిని దృష్టిలో పెట్టుకొని తహసీల్దార్ ఆధ్వర్యంలో భోజనాలు సమకూర్చే ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పునరావాస కేంద్రంలో భోజన ఏర్పాట్లను పరిశీలన చేశారు. వైద్య శిబిరం కూడా అందుబాటులో ఉంచి, ఏటువంటి సమస్య ఉన్నా వెంటనే తెలియ చెయ్యాలని కోరడం జరిగిందన్నారు.

మండల స్పెషల్ అధికారి ఏ. దుర్గేశ్ మాట్లాడుతూ, రెస్క్యూ ఆపరేషన్ నిమిత్తం మత్స్య శాఖ రెండు బోట్లు, ఫర్ డిపార్ట్మెంట్ ఒక బోటు సమకూర్చినట్లు తెలిపారు. నందమూరు ఆక్విడేట్ వద్ద పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి, వరద ఉదృతి ని పరిశీలించినట్లు , ఆమేరకు కలెక్టర్ కి నివేదిక ఇచ్చామన్నారు.

తహశీల్దార్ వి. నాగభూషణం వివరాలు తెలియ చేస్తూ, ఏటువంటి ప్రాణనష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుతున్నట్లు, వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామన్నారు. సెట్టి పేట గ్రామంలో పంట పోలాలకు పూర్తి నష్టం ఏర్పడినట్లు ప్రాధమిక అంచనాకు రావడం జరిగిందన్నారు

ఈ పర్యటనలో మండల ప్రత్యేక అధికారి ఏ. దుర్గేష్, తాహసిల్దార్ బి నాగభూషణం, ఎంపీడీవో జే. ఏ.ఝాన్సీ, వ్యవసాయ అధికారి జి. సత్యనారాయణ, తదితరులు పాల్గోన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *