Breaking News

ఎర్ర కాలువ ఏటిగట్లు పటిష్టతకు ఆధునీకరణ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగింది

-వరద ఉధృతి కారణంగా రైతు నష్టపోయిన ప్రతి ఎకరాకు ఇన్పుట్ సబ్సిడీ అందించే చర్యలు చేపడతాం.
-మోకాలు లోతు వరదనీటిలో వీధుల్లో వెంబడి నడిచి పునరావాస కేంద్రాల్లో ఉన్న నిర్వాసితులను పరామర్శించి వారికి అందుతున్న, ఆహారం, వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్న మంత్రి.
-రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ఎర్ర కాలవ వరద ఉధృతి వలన పంట పొలాలు నష్టపోవడమే కాకుండా గ్రామాల్లోనికి నీరు చేరి ఇల్లు కూడా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఎర్రకాలువ వరద నియంత్రణకు శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

సోమవారం మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజకవర్గం లో తాళ్లపాలెం, కాల్దారి, సూర్యరావుపాలెం, కానూరు గ్రామాల్లోని వరద ముంపు ప్రాంతంలను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తాళ్లపాలెం, కాల్దారి, సూర్యరావుపాలెం, కానూరు వరద ముంపు ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించి స్వయంగా గ్రామాల్లోని వీధులు జలమయం కావడంతో మోకాలు లోతువున్న ఆ నీటిలోనే ఇంటింటికి తిరిగి ప్రజలను పరామర్శించారు. స్థానికంగా ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను సందర్శించి ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాలు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యులు వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్యులకు సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతి ఏడాది ఎర్రకాలువ వరద ఉధృతి వలన వేలాది ఎకరాల పంట నష్టం తో పాటు గ్రామాల్లో నీరు చేరి ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఎర్ర కాలువ వరద నియంత్రణకు శాశ్వత పరిష్కారం దిశగా ఏటి గట్టు పటిష్టత చేసే విధంగా ఆధునీకరణ పనులను ప్రభుత్వం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గత గత ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో ఎర్ర కాలువ వరద నియంత్రణ పటిష్టతకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. భవిష్యత్తులో ఎర్రకాలు వరద ముంపు నివారిణే లక్ష్యంగా బలహీనమైన ఏటిగట్లను పటిష్టత పరిచే విధంగా కార్యాచరణతో ఆధునికరణ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు.

ఎర్ర కాలువ ఆధునికరణపై ఉదయం అసెంబ్లీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తో మాట్లాడడం జరిగిందన్నారు. ప్రస్తుతం చేపట్టవలసినఅంశం, స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికతో ఎర్రకాల్వ ఆధునికరణ పనులను చేపట్టే విధంగా కార్యాచరణరూపొందిస్తామన్నారు. ముఖ్యంగా వరద తీవ్రత తగ్గిన వెంటనే రైతుల నష్టాన్ని, గ్రామాల్లో నీట మునిగిన ఇల్లు పరిస్థితులను ఎన్యుమరేట్ చేసి నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులు వరద తీవ్రతను దృష్టిలో పెట్టుకొని లోతుతట్టు గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వసతితో పాటు భోజన సౌకర్యం అందించడం హర్షనీయమన్నారు.

ఇప్పటికే రైతులు ఎకరాకు రు. 20 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారని, సీడ్ సబ్సిడీ వలన ఎకరాకు 1000 రూపాయలు మాత్రమే వస్తుందని, నష్టపోయిన ప్రతి ఎకరాకు రైతుకు ఇన్పుట్ సబ్సిడీ రు. 6 వేల రూపాయలు అందించే విధంగా ముఖ్యమంత్రిని కోరడం జరిగిందని, సీఎం..
సానుకూలంగా స్పందించారని
మంత్రి కుందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో పేరుకు మాత్రమే రెండు పంటలు అని, ఇటువంటి ప్రకృతి విపత్తులు వలన ఒక పంట మాత్రమే రైతు చేతికి అందుతుందన్నారు. రాబోయే రోజుల్లో ముంపు నివారణకు సమగ్ర ప్రణాళికతో కార్యచరణ రూపొందించడం జరుగుతుందన్నారు.

సింగవరం తిమ్మరాజుపాలెం, తాళ్లపాలెం, రావిమెట్ల, కంసాలిపాలెం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో 957 మందికి సౌకర్యాలను అధికారులు కల్పించడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఆర్వి రమణ నాయక్, మండల ప్రత్యేక అధికారి ఏ.దుర్గేష్, తాహసిల్దార్ వి. నాగభూషణం, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *