Breaking News

జాయింట్ క‌లెక్ట‌ర్‌గా సంప‌త్ కుమార్ సేవ‌లు అద్వితీయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా డా. పి.సంప‌త్ కుమార్ అందించిన సేవ‌లు అద్వితీయ‌మ‌ని.. ఆయ‌న అత్యంత స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నార‌ని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన పేర్కొన్నారు. జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా పనిచేసిన సంప‌త్ కుమార్ విశాఖ‌ప‌ట్నం మునిసిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీపై వెళ్తున్న నేప‌థ్యంలో సోమ‌వారం పింగళి వెంకయ్య సమావేశం మందిరంలో జ‌రిగిన వీడ్కోలు కార్య‌క్ర‌మంలో ఆయ‌న్ను జిల్లా అధికారులు ఘనంగా స‌త్క‌రించారు. వివిధ శాఖ‌ల అధికారులు ఆయ‌న‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కలెక్టర్ సృజన మాట్లాడుతూ నిబ‌ద్ధ‌త‌తో, క్ర‌మ‌శిక్ష‌ణ‌తో సంప‌త్ కుమార్ సేవ‌లు అందించి.. త‌న‌దైన ముద్ర వేసుకున్నార‌న్నారు. ప్రభుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల అమ‌ల్లో ప్ర‌తి అంశంలోనూ కిందిస్థాయి సిబ్బందికి స‌రైన మార్గ‌నిర్దేశ‌నం చేస్తూ, మంచి ఫలితాలు వ‌చ్చేలా ప‌నితీరు క‌న‌బ‌రిచార‌న్నారు. ముఖంపై చిరున‌వ్వును చెద‌ర‌నివ్వ‌కుండా, విధి నిర్వ‌హ‌ణ ప‌రంగా రాజీప‌డ‌కుండా సేవ‌లందించార‌న్నారు. భ‌విష్య‌త్తులోనూ ఆయ‌న మ‌రిన్ని ఉన్న‌త‌స్థానాల‌కు చేరుకోవాల‌ని కోరుకుంటున్నామ‌ని పేర్కొన్నారు.

అనంతరం డిఆర్ఓ వి. శ్రీనివాసరావు, ఆర్డీవోలు భవాని శంకర్, మాధవి, రవీందర్రావు, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, డిపిఓ ఎన్ వి శివప్రసాద్ యాదవ్ హౌసింగ్ పీడీ రజిని కుమారి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డి.వి. రమణ, ఆర్ అండ్ బి ఎస్ఈ వి కే విజయ శ్రీ , డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ జి మోహన్ బాబు డిస్ట్రిక్ట్ యా నిమల్ హస్బెండరీ ఆఫీసర్ కె. విద్యాసాగర్, ఫిషరీస్ డిడి పెద్దిరాజు, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ పి. బాలాజీ కుమార్, డ్రామా ప్రాజెక్ట్ డైరెక్టర్ జే.సునీత అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష జీ మహేశ్వర రావు గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కే అనురాధ ,ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి ఉమాదేవి ఏపీఎంఐపీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.ఎం సుభాని, గ్రౌండ్ వాటర్ డిప్యూటీ డైరెక్టర్ బి నాగరాజు లు జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *