Breaking News

ఉచిత శిక్షణ కు దరఖాస్తులు ఆహ్వానం..!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కానూరు లో “ఫెడరల్ స్కిల్ అకాడమీ” ట్రైనింగ్ సెంటర్ నందు ప్రస్తుత జాబ్ మార్కెట్లో మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి “టాలీ (Tally)” కోర్సుపై సర్టిఫికెట్ తో కూడిన ఉచిత శిక్షణ తో పాటు ఖచ్చితమైన ఉద్యోగావకాశాలకు సంబంధించి అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీనివాసరావు తెలియజేసారు. అనంతరం జిల్లా ఉపాధి కల్పన అధికారి విక్టర్ బాబు మాట్లాడుతూ ఈ శిక్షణలకు బి.కామ్, బీఎ, బీబీఏ, ఎమ్.కామ్ పూర్తి చేసిన 18 నుండి 30 సంవత్సరాల అభ్యర్థులు అర్హులు అని తెలియజేసారు. ఈ నెల 25 మరియు 26న కౌన్సిలింగ్, తదుపరి శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. శిక్షణ అనంతరం ప్రముఖ ప్రైవేటు రంగ సంస్థలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా కానూరు లోని తులసినగర్ లో గల “ఫెడరల్ స్కిల్ అకాడమీ” ట్రైనింగ్ సెంటర్ కు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో పాటు, ఆధార్ కాపీ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో వచ్చి తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 87146 92747 నంబర్ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *