Breaking News

తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ క్లారిటీ….

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటూ శాసనమండలి సమావేశాలు కూడా నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఆ సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి లోకేష్ సమాధానాలు ఇచ్చారు. అమ్మకు వందనం పథకంపై వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు స్కూలుకు వెళ్తుంటే అంతమందికీ ఇస్తామన్నారు. అందులోనూ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులకు కూడా లబ్ది చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆ పథకం విధివిధానాలపై కసరత్తు జరుగుతోందని, త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. పలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను నమ్మొద్దన్నారు మంత్రి నారా లోకేష్. గత ప్రభుత్వ హయాంలో విద్యావ్యవస్థ పెద్ద ఎత్తున వైఫల్యం చెందిందని ఆరోపించారు. గతపాలకుల అసమర్థత వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు 72వేల మంది తగ్గారన్నారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్న విద్యావిధానానికి, ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యావిధానాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న మంచి విధానాలపై అధ్యయనం చేస్తామని వివరించారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి విద్యావ్యవస్థలో మంచి విధివిధానాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *