Breaking News

ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుతో చేనేతకు పూర్వ వైభం

-రాష్ట్ర బీసీ సంక్షేమ, టెక్ట్ టైల్స్ శాఖ మంత్రి సవిత
-ప్రతి చేనేత కార్మికుడికి పని కల్పిస్తాం
-చేనేత కార్మికుల సంస్యల పరిష్కారానిక కృషి
-చేనేతను నిర్వీర్యం చేసిన జగన్
-ప్రతి జిల్లాలోనూ చేనేత ఎగ్జిబిషన్లు : మంత్రి సవిత

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుతో చేనేత రంగానికి మరోసారి పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, టెక్ట్ టైల్స్ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ప్రతి చేనేత కార్మికుడికీ పని కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బుధవారం పలు చేనేత కార్మిక సంఘాల నాయకులు మంత్రి సవితిను సచివాలయంలోని నాలుగో బ్లాక్ ఆమె కార్యాలయంలో కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో కలిసి ఆమె…హ్యాండ్ లూమ్, పవర్ లూమ్ కార్మికుల డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. ప్రతి చేనేత కార్మికుడికీ పని కల్పించాలన్నదే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…చేనేత కార్మికులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. యువగళం పాదయాత్రలో చేనేత కార్మికుల కష్టాలను ప్రత్యక్షంగా చూశారన్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే చేనేతకు పెద్దపీట వేస్తానని ఆనాడే ఆయన హామీ ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబు కూడా చేనేత రంగానికి వెన్నుదన్నుగా నిలవాలని నిర్ణయించారన్నారు. 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో చేనేత రంగానికి మేలు చేసేలా ఎన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు అమలు చేసిన విషయాన్నిమంత్రి సవిత గుర్తుచేశారు. తరవాత వచ్చిన జగన్…చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని, దీనివల్ల ఎందరో చేనేత కార్మికులు ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. చేనేత కార్మిక సంఘాల డిమాండ్లను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హ్యాండ్ లూమ్, పవర్ లూమ్ కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల సందర్భొంగా చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని మంత్రి స్పష్టంచేశారు.

ఎగ్జిబిషన్లో పాల్గొనండి…
వచ్చే నెల ఏడో తేదీన విజయవాడలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా భారీ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో చేనేత కార్మికులు స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ స్టాళ్ల ఏర్పాటుకు ఎటువంటి అద్దె చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. స్టాళ్లు ఏర్పాటు చేసేవారికి ఉచిత భోజన సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన జిల్లాల్లోనూ నెలకోసారి చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాటిలో స్టాళ్లు ఏర్పాటు చేసి, కార్మికుల తమ వద్ద ఉన్న చీరలు, ఇతర వస్త్రాలను విక్రయించుకోవాలని సూచించారు. చేనేత కార్మికులు సొసైటీలు గా ఏర్పడడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడించారు. ప్రభుత్వ పరంగా సొసైటీల నుంచి చీరలు, యూనిఫారాలు కొనుగోలుకు అవకాశం కలుగుతుందన్నారు. డీసీసీబీ నుంచి రుణాలు తీసుకునే సౌలభ్యం ఉందన్నారు. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చేనేత వస్త్రాల విక్రయానికి చేనేత కార్మికులకు శిక్షిణిచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, చేనేత రంగ అభివృద్ధికి సీఎంచంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారు. అంతకుముందు జాతీయ చేనేత ఐక్య వేదిక నాయకులు కూడా మంత్రి సవితను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. చేనేత రంగ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, చేనేత, జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, కమిషనర్ రేఖారాణి పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *