Breaking News

రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల్లో డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రహారీ క్లబ్ లు ఏర్పాటు

-కేసలి అప్పారావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ,కళాశాలల్లో మరియు వసతి గృహాల్లో డ్రగ్స్ వినియోగం,విక్రయంని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ప్రహారీ క్లబ్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు మరియు విద్యాశాఖ అడిషనల్ డెరైక్టర్ ఏం.ఆర్ .ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ రోజు రాష్ట్రం లోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, రీజినల్ జాయింట్ డైరెక్టర్ లు మరియు విద్యాశాఖ సిబ్బంది తో విద్యాసంస్థలు లో ప్రహరీ క్లబ్ లు ఏర్పాటు గురుంచి జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసి చేపడుతున్న కార్యక్రమాలు గురుంచి చర్చించడం జరిగింది. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వాడకాన్ని నిరోధించేందుకు ఉన్నత పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రగ్స్ వినియోగం, అమ్మకాలపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తుందనీ, అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ఉక్కు పాదం మోపి కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందనీ తెలిపారు.

మత్తుపదార్థాలను,మాదక ద్రవ్యాలు , పొగ త్రాగడం , ఆల్కహాల్ తీసుకోవడం వలన విద్యార్థులు, యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అందులో భాగంగా స్కూల్, కాలేజీల్లో డ్రగ్స్ వినియోగంపై రాష్ట్రంలో అన్ని శాఖల అధికారులు సమన్వయం తో అవగాహన కల్పించడం,ప్రచారం చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులపై శాఖాపరమైన చర్యలుకు ప్రభుత్వం వెనకాడటం లేదనీ,తాజాగా స్కూల్ పిల్లలు డ్రగ్స్​ బారిన పడకుండా ఉండేందుకు కొత్త తరహా ప్రణాళికలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందనీ తెలిపారు. డ్రగ్స్ ను వినియోగించకుండా, వాటిని పాఠశాల చుట్టుపక్కల ఎవరూ విక్రయించకుండా ఈ ప్రహారీ క్లబ్‌లు పటిష్ఠ చర్యలు తీసుకొనున్నాయనీ. డ్రగ్స్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంచడంతోపాటు నిరంతరం నిఘా వేసి పర్యవేక్షణ లో ఉంచుతాయని తెలిపారు.

ప్రహరీ క్లబ్‌లు పనిచేసే విధానంపై జాతీయ బాలల హక్కుల కమిషన్ వారు ఆదేశాలు, మార్గదర్శకాలతో మరింత బలోపేతం చేస్తున్నట్లు వ విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారులు వాసిరెడ్డి విజయ దుర్గ, ఏ.సుహాసిని పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *