Breaking News

ప్రతీ ఒక్కరిలో జాగృతి కలుగ చెయ్యడం తనిఖీల ముఖ్య ఉద్దేశ్యం

-స్కూల్స్ లో నూరుశాతం చెర్పికలు లక్ష్యం సాధించాలి
-ఆకస్మిక తనిఖీలు పర్యవేక్షణా ద్వారా జవాబుదారీతనం పెంచడం సాధ్యం
-సోమవారం నుంచి స్కూల్స్ తనిఖీలు నిర్వహిస్తా ..
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యవేక్షణ విధానం , అప్రమత్తత తో వ్యవహరించడం ద్వారా పాఠశాలల్లో విద్యా బోధన విధానాన్ని , నిర్వహణా సామర్ధ్యం గణనీయంగా పెంచడానికి ఆస్కారం ఉందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ లో పాఠశాల విద్యా పై విద్యా శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా పద్దతులు, నిర్వహణా సామర్ధ్యం పై సరైన పర్యవేక్షణ ఉంచడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించగలం అని పేర్కొన్నారు. విద్యార్ధుల హాజరు, స్కూల్స్ నిర్వహణా, మధ్యాహ్న భోజన పథకం అమలు, డ్రాప్ ఔట్స్ లేకుండా 100 శాతం చేర్పికలు, నాడు నేడు పనులు పురోగతి పై తనిఖీలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఎస్ ఓ పీ (సమాన ప్రక్రియ పద్ధతి) తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించే అధికారులు విధి నిర్వహణా విషయంలో ఉపాధ్యాయులను జాగృతి పరచాలన్నారు. మండల విద్యా అధికారులు క్షేత్ర స్థాయిలో స్కూల్స్ తనిఖీల విషయములో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, హాజరు శాతం, హాజరైన విద్యార్థులు సంఖ్య తో బేరీజు వేసుకుని, ఆమేరకు నివేదిక తయారు చేయాలన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో గుర్తించిన లోటుపాట్లు, వాటినీ అధిగమించే క్రమంలో తీసుకున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీలు కేవలం మొక్కు బడికి పరిమితం కారాదని స్పష్టం చేశారు.

“ఇకో – క్లబ్” యెుక్క ముఖ్య ఉద్దేశ్యం చెట్లు నాటడం తో సరిపోదని, వాతావరణ సమతుల్యత ను కాపాడడం లో మొక్కలు నాటడం ద్వారా ఒనగూరే ప్రయోజనం పై విద్యార్థుల్లో అవగాహనా పెంచడం అని కలెక్టర్ పి. ప్రశాంతి తెలియ చేసారు. నాటిన చెట్ల పరిరక్షణ యొక్క ప్రయోజనం పై అవగాహాన కల్పించడం వలన వాటి పరిరక్షణ బాధ్యతలు స్వచ్ఛందంగా చేపట్టడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.

ఎయిడెడ్ స్కూల్స్ లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం పై స్కూల్స్ వారీగా సమగ్ర నివేదిక అందచేయాలని ఆదేశించారు. పీ ఏం శ్రీ, నాడు నేడు పనులు , పాఠశాలల నిర్వహణ, విద్యార్థులు హాజరు, కిట్స్ పంపిణీ, మధ్యాహ్న భోజనం అమలు తీరు, స్కూల్స్ లో పారిశుధ్య నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు, క్షేత్ర స్థాయి తనిఖీల్లో అధికారులు గుర్తించిన రిమార్కులు, ల్యాబ్స్ నిర్వహణా వొకేషనల్ విద్యా , భవిత స్కూల్స్, త్రాగునీరు , టాయిలెట్స్ నిర్వహణా తదితర అంశాలకి చెంది సోమవారం నుంచి క్షేత్ర స్థాయి లో తనిఖీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆకస్మిక తనిఖీలు ద్వారా ప్రథానోపాధ్యాయు లని , ఉపాధ్యాయులను జాగృతి పరచడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా విద్య శాఖల అధికారులు వారి పర్యటన సంధర్భంలో అనుసరించాల్సిన వైఖరి పై కలెక్టర్ వివరించారు. త్వరలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి ఆ మేరకు అవగాహన పెంచాలన్నారు. విధుల పట్ల ఏ ఒక్క ఉపాధ్యాయుడు నిర్లక్ష్య ధోరణిగా ఉండరాదని ఆ మేరకు వారిలో అవగాహన పెంచాలని తెలిపారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను సరి చేయించేందుకు తగిన సూచనలు చేయాల్సి ఉందన్నారు. పాఠశాల అందించిన సాంకేతిక పరికరాలు, ట్యాబ్స్ లు వినియోగించడం ఉపాధ్యాయుల బాధ్యతా గా పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పాఠశాల విద్యాధికారి కె వాసుదేవరావు, ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. సుభాషిణి, ఇతర విభాగాల నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *