Breaking News

జిల్లాలో రోగనిరోధక టీకాల లక్ష్యసాధన నూరుశాతం జరగాలి.

-ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను మెరుగుపరచాలి.
-కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో రోగనిరోధక టీకాల లక్ష్యసాధన క్షేత్ర స్థాయిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లాలో అమలు జరుగుతున్న ఆరోగ్య కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో రోగనిరోధక శక్తిని పెంచే టీకాలు నిర్దేశించిన వయసుగల పిల్లలందరికీ క్రమం తప్పకుండా వేయాల్సి ఉందన్నారు. తల్లి బిడ్డల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లాలో గర్భిణీ స్త్రీల వివరాలను నమోదు చేసి ప్రసవాలు జరిగే ఆసుపత్రుల వారీగా మ్యాపింగ్ కోసం నిర్దేశించాల్సి ఉందన్నారు. జిల్లాలో ఆరోగ్య సేవలు మెరుగుపరచడం ద్వారా ఆరోగ్యవంతమైన తల్లి బిడ్డల సంరక్షణ లక్ష్యంగా వైద్య సేవల నిర్వహణా సామర్థ్యం ఉండాలన్నారు.

ప్రభుత్వాసుపత్రిలో ప్రసవాల సంఖ్యను మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పీహెచ్సీల వారి నెలకు 5 ప్రసవాలు జరిగే విధంగా ముందస్తు కార్యాచరణ రూపొందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ ఫిజీషియన్ కాన్సెప్ట్ ద్వారా వైద్య సేవలు సమర్థవంతంగా అమలు అయ్యేలా చూడాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య ఆసుపత్రుల్లో నీరు , విద్యుత్ సౌకర్యం కల్పించి వాటినీ వెంటనే వినియోగం తీసుకుని రావాలని ఆదేశించారు

జిల్లాలో మాతృ శిశు మరణాలు జరగకుండా చూడాలని ఈ అంశంపై తరచు సమీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. జననీ సురక్ష , మాతృశ్రీ వందనం పథకాలకు సంబంధించి పోస్టల్ ఎకౌంటును ప్రారంభించి పథకాల లక్ష్యలను అర్హులందరికీ అందేలా చూడాలన్నారు. ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలు, సిరప్ ల వివరాలను ఈ ఔషధీ యాప్ నందు నమోదు చేయాలన్నారు. చిన్నారులకు గర్భిణీ స్త్రీలకు హిమోగ్లోబిన్ శాతం పెరిగే ఇమునైజేషన్ టీకాలు వేయాలన్నారు.

సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కే. వెంకటేశ్వరరావు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ లు డా.జె. సంధ్య, డా. ఎం.శ్రీ హరిబాబు, డిఐ ఓ డా. రాజకుమారి, డిపిహెచ్ఎన్ లు డా. జి. వసంత లక్షి, డా. అభిషేక్ రెడ్డి, డిస్ ఓ డా. రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *