Breaking News

ఢిల్లీలో జ‌గ‌న్ ధ‌ర్నా అట్ట‌ర్ ప్లాప్…పాక్షిక విజ‌యం మాదే

-సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గిరిజ‌న మ‌హిళ శాంతి, మ‌ద‌న్ మోహ‌న్ విష‌యంలో వైసిపి ఎంపి విజ‌య‌సాయి రెడ్డి చేసిన అన్యాయాన్ని వ్య‌తిరేకిస్తూ ఎంపి స‌భ్య‌త్యాన్ని ర‌ద్దు చేయాల‌ని కొరుతూ ఢిల్లీలో ధ‌ర్నా చేసే విష‌యంలో జ‌గ‌న్ రెడ్డి, ఎంపి విజ‌య‌సాయిరెడ్డి క‌లిసి ఢిల్లీ పోలీసుల‌తో ఎన్నో ఆటంకాలు క‌ల్పించార‌ని సోష‌ల్ డెమోక్ర‌టిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గుర్నాథం ఆరోపించారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శ‌నివారం మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో విజ‌య‌సాయిరెడ్డి విష‌యం ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే ఢిల్లీ లో దొంగ ధ‌ర్నా చేయ‌టానికి ప్ర‌య‌త్నించి విఫ‌లం చెందాడ‌న్నారు…గిరిజ‌న మ‌హిళ శాంతికి అన్యాయం జ‌ర‌గ‌కూడ‌ద‌నే తాము కూడా ఢిల్లీలో చేప‌ట్టిన ధ‌ర్నా కార‌ణంగా, త‌మ‌ నిర‌స‌న గ‌మ‌నించి, జ‌గ‌న్ త‌మ‌పై ఢిల్లీ పోలీసుల‌ను పంపించి అడ్డుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు అర్ధం చేసుకుని స‌మాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ జ‌గ‌న్ ధ‌ర్నా నుంచి నిష్క్ర‌మించట‌మే త‌మ‌కు పాక్షిక విజ‌యం లాంటిద‌న్నారు.

త‌న‌ని అడ్డుకునేందుక జ‌గ‌న్, విజ‌య‌సాయి రెడ్డి జంత‌ర్ మంత‌ర్ అసిస్టెంట్ సిపి మ‌హేంద్ర సింగ్ ను రంగంలోకి దింపి, ప‌ర్మిష‌న్ ఇవ్వ‌కుండా పోన్ లో భ‌య‌భ్రాంతుల‌కు గురి చేపించార‌ని తెలిపారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోయినా ధైర్యం వ‌చ్చి నిర‌స‌న చేస్తాన‌ని ఆ సిపి తో చెప్పినట్లు మాదిగాని తెలియ‌జేశారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధ‌ర్నాకు ప‌ర్మిష‌న్ ఇచ్చిన మ‌హేంద్ర‌సింగ్ త‌మ‌కి ఇవ్వ‌కపోయిన ధర్నా ఢిల్లీలో చేసిన‌ట్లు తెలిపారు. జ‌గ‌న్ చేస్తున్న దొంగ ధ‌ర్నా వైపు వంద‌లాది మంది కార్య‌క‌ర్త‌ల‌తో దూసుకుపోగా, అక్క‌డ మీడియా క‌వ‌ర్ చేయ‌కుండా అడ్డుకున్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. జ‌గ‌న్ దొంగ ధ‌ర్నా ముందు మా నిర‌స‌న కార్య‌క్ర‌మం చూసిన అఖిలేష్ యాద‌వ్ అక్క‌డ నుంచి వెళ్లిపోయాడ‌న్నారు. ఆ స‌మ‌యంలో పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు చెప్పారు.

అలాగే విజ‌య‌సాయిరెడ్డి అవినీతి బ‌ట్ట‌బ‌యలు చేయాల‌ని రాష్ట్ర‌ప‌తి ద్రౌపది ముర్ము కి విన‌తి ప‌త్రం అందించిన‌ట్లు తెలిపారు.అలాగే పార్ల‌మెంట్ లోని ప‌లు పార్టీ నాయ‌కులు కూడా ఇచ్చిన‌ట్లు చెప్పుకొచ్చారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌డ్ ను క‌లిసి విజ‌య‌సాయిరెడ్డి పై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర‌గా సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు. అలాగే పి.ఎమ్.వో కూడా ఇచ్చామ‌ని, మరో మూడు రోజుల్లో ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోదీ నుంచి పిలుపువ‌స్తుంద‌ని… వంద‌లామంది కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌వ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. జ‌గ‌న్ పై త‌ను అభాండాలు వేస్తున్న‌ట్లు చెబుతున్నాడు. జ‌గ‌న్ కి స్క్రిప్ట్ లేక‌పోతే ఏది చెప్ప‌లేడు. అందుకే త‌న పేరు కూడా స‌రిగ్గా ప‌ల‌క‌లేక‌పోయాడ‌ని మాదిగాని ఎద్దేవా చేశాడు. విజ‌య‌సాయిరెడ్డి ద‌మ్ముంటే త‌న ఇంటికి రావాల‌ని స‌వాల్ చేశాడు..త్వ‌ర‌లోనే వినూత్న రీతిలో ఆయ‌న ఇంటికి రెండొంద‌ల పందుల్ని పంపించి నిర‌స‌న తెలియ‌జేస్తామ‌న్నారు. ఆ పందులే విజ‌య‌సాయిరెడ్డికి స‌మాధానం చెబుతాయ‌న్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *