Breaking News

జ‌గ‌న్ పులివెందుల పులి కాదు..పారిపోయిన‌ పిల్లి…

-టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి నాగుల్ మీరా

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జ‌గ‌న్ త‌న హ‌యంలో చేసిన పాపాలు, కుంభ‌కోణాలు, దారుణాలు చెప్ప‌టానికి అసెంబ్లీలో 15 గంట‌ల‌ స‌మ‌యం కూడా స‌రిపోలేదు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు జ‌గ‌న్ పాపాల చిట్టా ఎక్క‌డ విప్పుతాడోన‌ని భ‌య‌ప‌డి అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పారిపోయాడ‌ని టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాగుల్ మీరా జ‌గ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్టీ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శ‌నివారం టిడిపి రాష్ట్ర అధికార ప్ర‌తినిధి, మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాగుల్ మీరా జ‌గ‌న్ అసెంబ్లీకి రాకుండా టిడిపి పై, సీఎం చంద్ర‌బాబు పై చేస్తున్న దుప్ప్ర‌చారంపై మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే జ‌గ‌న్ మాట వినేవారు ఎవ‌రులేర‌ని నాగుల్ మీరా అన్నారు. అసెంబ్లీకి వ‌చ్చే ధైర్యం లేక త‌ప్పించుకునేందుకు లేని దుష్ప్ర‌చారాలు చేయించి ధర్నా పేరుతో పులి వెందుల పులి అని చెప్పుకునే జ‌గ‌న్ పిల్లిలా ఢిల్లీ పారిపోయాడ‌ని విమ‌ర్శించారు. అసెంబ్లీలో చంద్ర‌బాబు జ‌గ‌న్ పాపాల‌ చిట్టా చ‌దువుతుంటే చెవుల్లో సీసం పోసుకోవాల్సి వ‌స్తుంద‌ని జ‌గ‌న్ పిల్లిలా ఢిల్లీ పారిపోయాడ‌న్నారు.

ప్ర‌జ‌లు ఎన్టీయేకి జ‌గ‌న్ పై అసంతృప్తితో ఓట్లు వేయ‌లేదు. జ‌గ‌న్ కి భ‌య‌ప‌డి ఓట్లు వేశార‌ని తెలిపారు. జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌కు వ్య‌తిరేకంగా ఓట్లు వేశార‌ని తెలిపారు. జ‌గ‌న్ ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా వుంద‌న్నారు. ఆంధ్రరాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ఏకైక ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అంటూ తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ త‌న హ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు బ‌య‌టికి రాకుండా ఇంటి గేటుకి తాళ్లు క‌ట్టిన‌ప్పుడు ప్ర‌జాస్వామ్యం గుర్తుకి రాలేదా అంటూ ప్ర‌శ్నించారు. రాజ‌ధాని కోసం 33 వేల ఎక‌రాలు భూమి ఇచ్చిన ఆడ‌బిడ్డ‌ల‌ను జుట్టు ప‌ట్టి ఈడ్చి త‌న్నించిన‌ప్పుడు ప్ర‌జాస్వామ్యం గుర్తుకు రాలేదా అంటూ నిల‌దీశారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌పైన‌, ప్ర‌జా సంఘాల‌పైన, ఉద్యోగ సంఘాల‌పైన నిర్భంద పాల‌న చేసిన‌ప్పుడు ప్ర‌జాస్వామ్యం గుర్తు రాలేదా జ‌గ‌న్ రెడ్డి అంటూ సూటిగా ప్ర‌శ్నించారు.

ప్ర‌జాస్వామ్యం విలువ తెలియ‌ని జ‌గ‌న్ రెడ్డి కి ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడే హ‌క్కు లేద‌న్నారు. జ‌గ‌న్ అంతా అబ‌ద్దాల కోరు మ‌నిషి దేశంలోనే ఎవ‌రు లేర‌న్నారు. 36 మంది వైసిపి కార్యక‌ర్త‌లు చ‌నిపోయిన‌ట్లు చెబుతున్న జ‌గ‌న్ ఎందుకు వారి పేర్లు, వివ‌రాలు చెప్ప‌టం లేదో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఎన్డీయే లో వుండే నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు త‌ప్ప‌…వైసిపి గుండా నాయ‌కులాగా ప్రజాస్వామ్యాన్ని అప‌హాస్యం పాలు చేయ‌ర‌న్నారు. జగన్ చేసిన పాపాలకు తీహార్ జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు.

ప్ర‌జ‌లు జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వ‌లేద‌న్న సంగ‌తి గుర్తు పెట్టుకోవాల‌న్నారు. గ‌తంలో ఇచ్చిన 151 సీట్ల‌లో నుంచి ఐదు పీకి 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌న్నారు. ప్ర‌తిప‌క్ష హోదా ఆశించ‌కుండా ద‌మ్ము, దైర్యం వుంటే అసెంబ్లీకి వ‌చ్చి స‌భ్యులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాల‌న్నారు. నా ఎస్సీ, నా ఎస్టీలంటూ ఆ వ‌ర్గాల‌కు జ‌గ‌న్ చేసినంత ద్రోహం ఇంకెవ్వ‌రు చేయ‌లేద‌న్నారు. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల హ‌క్కులు ర‌క్షించే నాయ‌కుడు చంద్ర‌బాబు నాయుడన్నారు. జ‌గ‌న్ జీవితంలో మాజీ ముఖ్య‌మంత్రిగానే మిగిలిపోతాడ‌ని తెలిపారు.

దేవతలు పాలించిన అమరావతి పేరున్న రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు చంద్రబాబు కు కల్పించారన్నారు. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం కోసం కేంద్రం 15 వేల కోట్ల రూపాయ‌లు ఇవ్వ‌టం, పోల‌వ‌రం నిర్మాణం పూర్తి చేసే బాధ్య‌త తీసుకోవ‌టం 33వేల ఎక‌రాలు ఇచ్చిన రైతుల‌తో పాటు, రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయ‌క‌త్వంలో కేంద్రం ఇచ్చిన వ‌రం అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *