-రోడ్లు, డ్రైన్స్, త్రాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు మీద ప్రత్యేక కార్యాచరణ
-ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ప్రాధాన్యత కార్యక్రమాలను అమలు చేస్తాం
నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు ప్రాధాన్యత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో అమలు చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందులు దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎక్స్-అఫిషియో మెంబర్ గా మొదటసారి ముఖ్యఅతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ భూపతిఆదినారాయణ కౌన్సిల్ సభ్యులను మంత్రి దుర్గేష్ కు పరిచయం చేశారు. అనంతరం పురపాలక సంఘ అభివృద్ధిలో భాగంగా పొందుపరచిన అజెండా అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా కందులు దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను రాజకీయాలకు తావు లేకుండా ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు క్షేత్రస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. రాబోయే రోజుల్లో నిడదవోలు పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి తో చర్చించి నిధులు సమీకరించి కార్యాచరణ తో రహదారులు, డ్రైన్స్, మురుగునీటి కాలువలు, త్రాగునీరు, పారిశుధ్యం, వీధిలైట్లు మీద ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. రాష్ట్ర ఖజానాలో నిధులు లేమి ఉందని, కేంద్రం నుండి నిధులు సమకూర్చుకోవడం తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు కాని తర్వాత ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. అధికారులు గతంలో ఉన్న ఆలోచనలు మార్పు చేసుకుని పనిచేయాలని, ఎక్కడ ఏ విధమైన అలసత్వం వహించకుండా పక్షపాతం లేకుండా పనిచేయాలని అన్నారు. పట్టణంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి రు. 15 వేల కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందన్నారు.
తొలుత పురపాలక సంఘ అభివృద్ధి అజెండాపై చర్చిస్తూ మున్సిపల్ సాధారణ నిధుల నుండి అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, మెయిన్ రోడ్ నందు ఎల్ఈడి వీధి దీపములు, మున్సిపల్ ఆఫీసు నందు జనరేటర్ రిపేరు రిజర్వాయర్లు వద్ద మోటర్లు భీమదారు డ్రైను సంజీవయ్య నగర్ రోడ్ల నందు సిల్టు తీయుటకు, 22వ వార్డు వైయస్సార్ కాలనీ లో సిమెంటు రోడ్డు, డివైడర్ కు గ్రానైట్ పనులకు, పురపాలక సంఘ ఫిష్ మార్కెట్ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నందులీజు కాలపరిమితి, శానిటేషన్ పనులలో భాగంగా ప్రధాన కూడళ్ళ నందు బ్లీచింగ్ చేయుటకు, శానిటేషన్ సిబ్బందికి గ్లౌజులు, బూట్లు, వారికి కావాల్సిన పరికరాల అందించుటకు, కోర్టు భవనము నందు రిపేర్లు, ట్రాక్టర్ ట్రైలర్ రిపేరు చేయుటకు, మున్సిపల్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సొమ్ము కొరకు అర్జీ ద్వారా కోరడంతో కౌన్సిలర్ నిర్ణయం కొరకు చర్చించగా ఆమోదించడం జరిగింది.
మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ పట్టణంలో అపరిస్కృతంగా ఉన్న పలు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు నిధులు మంజూరు చేసి పట్టణ అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందించాలని మంత్రిదుర్గేష్ విన్నవించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ను మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిల్ సభ్యులు, అధికారులు గజమాలను వేసి మెమెంటు వీణను అందించి ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగుల వెంకటలక్ష్మి, వెలగాడ బాలరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ పి రామ్ గోపాల్ రెడ్డి, మున్సిపల్ ఈఈ, ఏ మాధవి, ఆర్ ఓ, ఎం ఆర్ వి ఆర్ ప్రసాద్, నగ్మా సి ఎం ఎం, డి. శివప్రసాద్, కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు. అధికారులుపాల్గొన్నారు.