పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత…

-ప్రతి పాఠశాల లోనూ ఎకో క్లబ్ లు ఏర్పాటు చేయాలి
-విద్యార్థులు మొక్కలు నాటి దత్తత తీసుకుని వాటిని సంరక్షించాలి.
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతతో పర్యావరణ పరి రక్షణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. శనివారం స్థానిక ఇన్నీస్ పేట ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల లో శిక్షా సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా “పర్యావరణ పరిరక్షణ దినోత్సవం”లో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు పర్యావరణం పట్ల బాధ్యతతో మొక్కలు పెంపకం పై ఆసక్తి కలిగి ఉండాలన్నారు. ప్రతి పాఠశాలలోనూ ఎకో క్లబ్ లు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానివేయలన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖాధికారులు, విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థినులు నందిని, ప్రశాంతి, అక్షయలకు ఈ రోజు నాటిన మొక్కలను దత్తత ఇచ్చి, వాటిని శ్రద్ద గా పెంచే బాధ్యతను అప్పగించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు, సమగ్ర శిక్షా ఏ.పి.సి ఎస్. సుభాషిణి, ఏ ఎమ్ ఓ గౌరీ శంకర్,
రాజమహేంద్రవరం డివిజన్ ఉప విద్యా శాఖాధికారి ఈ వి బి ఎన్ నారాయణ, అర్బన్ రేంజ్ డి ఐ బి దిలీప్ కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని బి.శారదా దేవి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *