–రాజమండ్రి – ఏలూరు.. రాజమండ్రి – కాకినాడ నూతన బస్సు సర్వీసులను ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. శనివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నందు రాజమండ్రి – ఏలూరు, రాజమండ్రి – కాకినాడ నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆర్టీసీ అధికారులు, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థ అంటే ఒక నమ్మకమని, ప్రజలను తమ యొక్క గమ్య స్థానాలకు సురక్షితంగా తీసుకువెళ్లే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ అని తెలియజేశారు. ఇప్పటికే రాజమండ్రి నుంచి అనేక సర్వీస్ లు ఉన్నాయని, అయినప్పటికీ ప్రజలకు ఉత్తమమైన సర్వీసులు అందజేయాలనే ఉద్దేశంతో రాజమండ్రి నుంచి ఏలూరు కు ఒక బస్సు సర్వీసు, రాజమండ్రి నుంచి కాకినాడకు రెండు బస్సుల సర్వీసులను ప్రారంభించుకున్నామన్నారు.
ఆర్టీసీ భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు తమ సేవలను విస్తరిస్తూ ప్రయాణికుల ప్రయాణికుల మన్ననలు పొందుతూ ముందుకెళుతుందన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ఆర్టీసీ కార్యాచరణను కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ బాధ్యతలను నిర్వహిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికీ ఉచిత ఇసుక పాలసీని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చే ప్రయత్నంలో రవాణా శాఖ తో చర్చలు జరిపామని రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తారని తెలియజేశారు. ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించుకొనున్నామన్నారు. తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిపిటిఓ, కె.షర్మిల అశోక్, డి ఎం,డిపో మేనేజర్,ఎస్.కె. శబ్నం, బస్సు ఓనర్స్, సూపర్వైజర్స్,సెక్యూరిటీ, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.