Breaking News

వరద ముంపు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా నిత్యవసర సరుకుల పంపిణీ, ఆర్ధిక సహాయం అందచేత

-జిల్లా వ్యాప్తంగా 1421 కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ
-529 కుటుంబాలకు రూ.15 లక్షల 87 వేలు ఆర్ధిక సహాయం
-ఒకొక్క కుటుంబానికి రూ.3 వేలు చొప్పున అందచేత
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరీ వరదలు, ఎర్ర కాలువ వరదలలో జిల్లాలో ముంపుకు గురి అయిన 1421 కుటుంబాలకు పునరావాస పరిహారం కింద నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయా నిత్యావసర సరుకులను ప్రజా ప్రతినిధులు, అధికారులు సమక్షంలో అందజేసినట్లు తెలియ చేశారు. ఒకొక్క కుటుంబానికి బియ్యం 25 కిలోలు, కంది పప్పు ఒక కిలో, పామ్ ఆయిల్ ఒక లీటరు, ఉల్లిపాయలు ఒక కిలో, బంగాళా దుంపలు ఒక కిలో చొప్పున ఐదు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 529 మంది కుటుంబాలకు ఒకొక్క కుటుంబానికి రూ.3 వేలు చొప్పున ఆర్ధిక సహాయం అందచేస్తున్నట్లు తెలిపారు. మండలాలు వారీగా నల్లజర్ల  30 కుటుంబాలు, నిడదవోలు 336 కుటుంబాలు, రాజమహేంద్రవరం అర్బన్ 163   కుటుంబాలకు ఆర్ధిక సహాయం ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా అందచెయ్యడం జరుగుతోంది.

మండలాల వారీగా కుటుంబాలు ..
రాజమండ్రీ డివిజన్ 233 కుటుంబాలకు..
మండలాలు వారీగా – బిక్కవోలు -5 , గోకవరం – 18 , కడియం , కోరుకొండ – 20 రాజమహేంద్రవరం అర్బన్ – 163 , రాజమహేంద్రవరం గ్రామీణ – 1 , రంగంపేట – 5 , రాజానగరం – 9 , సీతానగరం – 8 .

కొవ్వూరు డివిజన్ .. 1188 కుటుంబాలు
* చాగల్లు – 1 , దేవరపల్లి – 11 , గోపాలపురం – 13 , కొవ్వూరు – 37 , పెరవలి – 4 , ఉండ్రాజవరం – 5 , నల్లజర్ల – 40 , నిడదవోలు – 1077.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *