Breaking News

బంగారుకొండ ప్లస్ కింద 1198 మంది గుర్తింపు

-అధికారులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి
-కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం కావాలి
-కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బంగారు కొండా ప్లస్ ద్వారా పిల్లల తీవ్రమైన పోషకాహార లోపం, బలహీనంగా ఉన్న, కుంగిపోయిన 1198 చిన్నారులను గుర్తించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం జరుగుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జరిపిన సమావేశంలో ” బంగారు కొండ ప్లస్ ” కార్యక్రమం తదుపరి కార్యచరణ పై కలెక్టర్ సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో బంగారు కొండ తొలి దశలో భాగంగా 1283 మంది పిల్లల పరిరక్షణ బాధ్యత తీసుకొని ఆరు నెలల పాటు కిట్స్ అందించడం జరిగిందన్నారు. జిల్లాలో తక్కువ బరువు ఉన్న 310 మంది పిల్లలు, బలహీనంగా ఉన్న , ఎత్తుకు తగ్గ బరువు లేని 642 మంది చిన్నారులు, పౌష్టికాహార లోపం ఉన్న 602 వెరసి జిల్లా వ్యాప్తంగా 1198 మందిని గుర్తించినట్లు తెలిపారు. అటువంటి చిన్నారులను పూర్తి ఆరోగ్య వంతులుగా సాధారణ స్థితికి తీసుకొని రావడంలో వైద్య ఆరోగ్య శాఖ, ఐ సి డి ఎస్ ల పరస్పర సమన్వయంతో ముందుకు వెళ్లడం జరుగుతుందని అన్నారు. గతంలో పిల్లల సంరక్షణా కోసం కొందరు అధికారులు పిల్లల పరిరక్షణ కైముందుకు రావడం జరిగిందన్నారు. అదే విధంగా అధికారులతో పాటు కార్పోరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసేలా అధికారులు చొరవ తీసుకోవాలని పేర్కొన్నారు. ఒకొక్క చిన్నారికి ఆరు నెలలకి రూ.3000 అందజేయాల్సి ఉంటుందని తెలిపారు. బంగారు కొండ ప్లస్ ద్వారా పిల్లలకు పౌష్టికాహర కిట్ తో వారిలో ఎదుగుదల లోపాలు గుర్తించి తగినచికిత్స అందించే క్రమంలో వైద్య పరంగా సూచనలను అందించే ప్రక్రియ లో ఆరోగ్య శాఖను కూడా అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు, ఇతర నోడల్ శాఖలు కార్పోరేట్ సంస్థలను, పారిశ్రామిక వేత్తలను కూడా భాగస్వామ్యం చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. పిల్లల సంరక్షణ కోసం ముందుకు వొచ్చే అధికారులు వారీ పేర్లు జిల్లా రెవిన్యూ అధికారికి, ఐ సి డి ఎస్ అధికారికి ఇవ్వాలన్నారు. “బంగారు కొండ ” కిట్స్ ఇవ్వడమే కాకుండా పిల్లల సంరక్షణ తీసుకున్న వ్యక్తులు ఆయా ఇళ్లను సందర్శించి భరోసా ఇవ్వడం, అవగహన పెంచే విధంగా ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *