Breaking News

నిర్దేశించిన లక్ష్యాలను ప్రణాళికా బద్ధంగా సకాలంలో సాధించాలి…

-జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా మహిళా సాధికార దిశగా స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నందు కలెక్టర్ గ్రామీణాభివృద్ధి సంస్థ మహిళా సాధికారత దిశగా చేపడుతున్న వివిధ రకాల ప్రభుత్వ పతాకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరం గ్రామీణాభివృద్ధి సంస్థ సంబంధించి వివిధ పథకాలలో 2024-25 నిర్దేశిత లక్ష్యాలను అంది పుచ్చుకోవాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 24,158 ఎస్ హెచ్ జి లకు బ్యాంకు లింకేజి లక్ష్యం రూ. 1355.92 కోట్లు కాగా నేటి వరకు 2032 స్వయం సహాయక సంఘాలకు రూ. 161.92 కోట్లు వివిధ బ్యాంకుల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయించడం జరిగిందనీ అధికారులు కలెక్టర్ కు వివరించగా త్వరితగతిన లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. అదే విధంగా ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీపై క్షేత్రస్థాయిలో అనుసరిస్తున్న విధి విధానాలపై సమీక్షించి మాట్లాడుతూ పెన్షన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే సచివాలయం సిబ్బంది ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గం. లకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ 99 శాతం తగ్గకుండా పూర్తి చేయాలని సూచించారు. వ్యవసాయ, వ్యవసాయేతర జీవనోపాదుల కింద, ఉన్నతి కార్యక్రమంలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ మహిళలు కవర్ అయ్యేలా అధికారులు దృష్టి సారించాలని సూచించారు. బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ (BMCU) లపై సమీక్షిస్తూ గ్రామాల్లోని పాడి రైతులు బిఎంసియులకి పాలు పోసే విధంగా అలాగే గిట్టుబాటు ధర వచ్చే విధంగా పాల నాణ్యత గురించి అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పథక సంచాలకులు ప్రభావతి, డీపీఎంయు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *