Breaking News

ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం సద్వినియోగం చేసుకోవాలి

-పోస్టర్ ను ఆవిష్కరించినజిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ గృహ వినియోగదారులు ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం యొక్క ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని అందులో భాగంగా పోర్టల్ లో పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పిలుపు నిచ్చారు. సోమవారం రాత్రి స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశం మందిరంలో కలెక్టర్ ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి . ప్రశాంతి మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం కేవలం గృహ వినియోగదారు ల కోసం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీతో వినియోగదారులు తమ ఇంటిపైనే సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోవచ్చునన్నారు. ఈ పథకం వలన గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని పేర్కొన్నారు. ఇంటి పైకప్పుపై కనీసం 10 చ.మీ. లేదా 100 చ య స్థలంలో 1 కిలో వాట్ పవర్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు.

విద్యుత్ శాఖ ఎస్ ఈ.. టీవీఎస్ ఎన్  మూర్తి, మాట్లాడుతూ ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పథకం కింద గృహాల పైకప్పులపై సోలార్ ప్యానెల్‌లను ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తుందన్నారు.

ఒక కిలో వాట్ సోలార్ రూప్ టాప్ ఏర్పాటు వలన 120 యూనిట్లు ఉత్పత్తి అవుతుందని, ప్రస్తుతం వినియోగదారుడు చెల్లిస్తున్న బిల్లు రఉ. 1000 రూపాయలతో పోలిస్తే సోలార్ ప్యానల్ ఏర్పాటు తర్వాత బిల్లు రు. 338 /- లు మాత్రమే వస్తుందని ఏడాదికి సుమారు రు. 8000 రూపాయలు వినియోగదారుడికి హాజరవుతుందని ఆయన చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద రు. 30 వేల రూపాయలు రాయితీని కూడా అందిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా వినియోగిదారునికి 2 కిలో వాట్స్, 3 కిలో వాట్స్ వరకు రాయితీ అందించడం జరుగుతుందని తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం, విద్యుత్ సమస్యల పరిష్కారం మరియు ఇతర సమస్యల నివృత్తి కొరకు 1912 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చుని ఆయన తెలిపారు.

కార్యక్రమంలో కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, డిఆర్ఓ ఇంచార్జీ జేసి జి . నరసింహులు, ఆర్డిఓ ఏ. చరిత్ర వర్షిని, డిఎఓ ఎస్. మాధవరావు, ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ ఈ.. టీవీఎస్ ఎన్ మూర్తి, ఈ ఈ..ఎన్. శ్యాములు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *