Breaking News

లైంగిక నేరాలను అరికట్టడం ప్రతి ఒక్కరి భాధ్యత…

-లైంగిక వేధింపులను ఆరికట్టి బాలికలకు బంగారు భవిష్యత్తునిద్దాం..
-ఫోక్సో చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయండి..
-జిల్లా కలెక్టర్‌ డా.జి. సృజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లైంగిక వేధింపుల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి లైంగిక వేధింపులను ఆరికట్టడం ప్రతి ఒక్కరి భాధ్యతని లైంగిక వేధింపులకు పాల్పడేవారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడ వద్దని జిల్లా కలెక్టర్‌ డా.జి. సృజన అన్నారు. లైంగిక వేధింపుల నివారణపై జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘‘అరవండి’’ ‘‘పరిగెత్తండి’’ ‘‘చెప్పండి నినాద్దంతో రూపొందించిన గోడ పత్రికలను సోమవారం జిల్లా కలెక్టర్‌ డా.జి. సృజన కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ బాలికల రక్షణకు కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న హక్కులు చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాల్సిన భాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికల రక్షణకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నప్పటికి అక్కడక్కడ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటనలు చోటు చేసుకోవడం బాధకరం అన్నారు. లైంగిక నేరాల నుండి బాలిక రక్షణ కొరకు ఏర్పాటు చేసిన ఫోక్సో చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. లైంగిక వేధింపులు అశ్లీల చిత్రాల నేరాల బారిన పడకుండా పిల్లల బంగార భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. బాలికల రహస్య భాగాలను తాకిన తాకుతున్న స్పర్శ చేసి అసౌకర్యాన్ని భయాన్ని కలిగించినా ‘‘అరవండి’’ ‘‘పరిగెత్తండి’’ ‘‘చెప్పండి’’ వంటి చర్యలు ద్వారా బాలికలు లైంగిక వేధింపుల సమస్యల నుండి బయటపడిన చైతన్యవంతులను చేయాలన్నారు. చిన్నతనం నుంచే తల్లిదండ్రులు బాలికల ఎదుగుదలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని లింగ వివక్షత చూడకుండా అన్ని రంగాలలో రాణించేలా ప్రోత్సహించాలన్నారు. లైంగిక వేధింపులను ఎదుర్కొనేలా బాలికలలో అవగాహన కల్పించి వారిని అప్రమత్తం చేయవాలసిన భాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పాఠశాలలు కళాశాలలో లైంగిక వేధింపులపై అవగాహన సదస్సును నిర్వహించి బాలికలను చైతన్యవంతులను చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాల కట్టడిపై మరింత కఠినంగా వ్యవహరించవలసిన భాధ్యత అధికారులపై ఉందన్నారు. బాలికలపై వేధింపులు, దోపిడీ, హింస వంటి సంఘటనలను గుర్తిస్తే చైల్డ్‌ లైన్‌ 1098, పోలీసు 100, ఉమెన్‌ హెల్ప్‌లైన్‌ 181, వంటి కాల్‌ ఫ్రీ నెంబర్‌లకు సమాచారం అందిస్తే తక్షణమే స్పందించి తగు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందనే సమాచారాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్‌, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమం, స్వచ్చంద సంస్థల సహకారంతో ఫోక్సో చట్టాంపై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జి. సృజన అధికారులకు సూచించారు.
పోస్టర్‌ విడుదల కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ డా. నిధి మీనా, డిఆర్‌వో వి. శ్రీనివాసరావు, ఐసిడిఎస్‌ పిడి జి. ఉమాదేవి, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ వెంకటేశ్వరరావు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కిరణ్మయి, ఫారెస్ట్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ టి.ఇ.యం.రాజు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *