Breaking News

ప‌త‌కాల పంట‌తో భార‌త కీర్తి ప‌తాక రెప‌రెప‌లాడాలి

-ఐ ఛీర్ 4 భార‌త్ సెల్ఫీ స్టాండ్‌ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌స్తుతం పారిస్‌లో జ‌రుగుతున్న 33వ ఒలింపిక్ క్రీడ‌ల్లో భార‌త కీర్తి ప‌తాక రెప‌రెప‌లాడేలా భార‌తీయ క్రీడాకారులు మ‌రిన్ని ప‌త‌కాలు సాధించాల‌ని కోరుకుంటున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అన్నారు. సోమ‌వారం క‌లెక్టర్ క్యాంపు కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ సృజ‌న‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనాతో క‌లిసి ఐ ఛీర్ 4 భార‌త్ సెల్ఫీ స్టాండ్‌ను ఆవిష్క‌రించారు. ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్‌లో భార‌త క్రీడాకారుల బృందం స‌త్తా చాటి ప‌త‌కాలు సాధించాల‌ని ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సృజ‌న మాట్లాడుతూ ఒలింపిక్ క్రీడ‌ల ఔన్న‌త్యాన్ని చాటిచెప్పేందుకు, భార‌తీయ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపడంలో భాగంగా సెల్ఫీ స్టాండ్‌ను ఆవిష్క‌రించిన‌ట్లు చెప్పారు. పారిస్ ఒలింపిక్స్‌లో షూటింగ్ క్రీడాకారిణి మ‌ను బాక‌ర్ భార‌త్‌కు తొలి ప‌త‌కం సాధించార‌ని.. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మిగిలిన క్రీడాకారులు ప‌త‌కాలు కైవ‌సం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో జిల్లా క్రీడ‌ల అభివృద్ధి అధికారి (డీఎస్‌డీవో) ఎస్ఏ అజీజ్ పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *