Breaking News

పోలీస్‌ బ్యాచ్‌ 95 బ్యాచ్‌కు న్యాయం చేయండి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పోలీస్‌ బ్యాచ్‌ 95 ఏంటి సినిమా పేరు అనుకుంటున్నారా. అయితే మీరు పొరపాటు పడినట్లే. సినిమాను తలపించే స్టోరీ. ఈ పోలీస్‌ బ్యాచ్‌ 95. పోలీస్‌ అంటే వీడురా అనే రోజుల్లో ఎంపికైన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ బ్యాచ్‌ 95. 15 సంవత్సరాలకి అంటే 2009లో సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ప్రమోషన్‌ పొంది నేటికీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గానే ఉన్నారు. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే 1996లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా జాయిన్‌ అయినా వాళ్ళు ఇప్పుడు డిఎస్‌పిగా ఉన్నారు. వాళ్ళకి జరిగిన అన్యాయం ఎవరికి చెప్పుకోవాలి. న్యాయం కోసం కోర్టుకు వెళితే ప్రభుత్వం నుంచి అధికారులు నుంచి ఒత్తిడీలు ఎక్కువైతే ఏం చేయాలి. వాళ్ల బాధ ఎవరికి చెప్పుకోవాలి. గత ప్రభుత్వం చేసిన తప్పు తెలుసుకొని కనీసం ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్నారు. ఏ వ్యవస్థలోనైనా సీనియార్టీని బట్టి ప్రమోషన్‌ ఇవ్వడం అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. 2009లో ముఖ్యమంత్రిగా రాజశేఖర్‌రెడ్డి ఉన్నపుడు ఎంపికైనా సబ్‌ ఇన్‌స్పెక్టర్లు 2020లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌రెడ్డి ఉన్నప్పుడు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ అయ్యారు. 1995లో ఎంపికైన సబ్‌ ఇన్‌స్పెక్టర్లు 2024 నేటికీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లుగానే ఉన్నారు. అంటే 29 సంవత్సరాలు ఇది వ్యవస్థ ఈ వ్యవస్థలో మార్పు రావాలి. కనీసం ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్న 95 బ్యాచ్‌. ఇప్పటికే డీజీపీని కలిసి తమ వినతిపత్రాన్ని పోలీస్‌ బ్యాచ్‌ 95 అందజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *