Breaking News

జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే ఆగస్ట్ 1వ తేదీన పంపిణీ

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఆగస్ట్ 1న ఉదయం షార్ప్ 6 గం. నుండి పంపిణీ చేయనున్నామని, ఏదైనా సాంకేతిక కారణాలవలన పెన్షన్ అందకుండా మిగిలిపోయిన వారికి మరుసటి దినం 2వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందని తెలుపుతూ లబ్ధిదారులు1వ తేదీన వారి ఇంటి వద్ద అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు.

మంగళవారం సాయంత్రం అమరావతి నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత కార్యదర్శులు, అధికారులతో కలిసి ఆగస్ట్ 1న పంపిణీ చేయనున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ మరియు జెసి శుభం బన్సల్ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు. విసి అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ ఆగస్ట్ 1 వ తేదీ పెన్షన్ల పంపిణీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉదయం 6 గం. కు సచివాలయం సిబ్బంది ప్రారంభించాలని, మొదటి రోజున 99 శాతం పైన పంపిణీ చేయాలని సూచించారు. సాంకేతిక కారణాలవలన మిగిలిపోయిన పెన్షన్ల పంపిణీ మరుసటి దినం 2వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలనీ తర్వాత పెన్షన్ పంపిణీకి యాప్ క్లోజ్ అవుతుందని తెలిపారు. పెన్షన్ లబ్ధిదారులు అందరూ 1 వ తేదీనే ఎవరి ఇంటి వద్దనే వారు ఉండి పెన్షన్ తీసుకోవాలి అని, బయట గ్రామాలకు వెళ్ళిన వారు కూడా 1 వ తేదీన తమ పెన్షన్ ఉన్న గ్రామాలలో తమ ఇంటి వద్ద వుండి పెన్షన్ తీసుకోవాలని తెలిపారు. సదరు అంశాన్ని గ్రామాల్లో టామ్ టామ్, మైక్ ద్వారా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి అధికారులు ప్రజల్లో అవగాహన కల్పించాలని, పెన్షన్ లబ్దిదారులు ఎవరూ సచివాలయ కార్యాలయానికి రావలసిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. సదరు ఎంపిడిఓ లు, గ్రామ వార్డు సచివాలయం అధికారులు పెన్షన్ పంపిణీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని సూచించారు.

ఈ సమావేశంలో పిడి, డి ఆర్ డి ఎ, ప్రభావతి, డిప్యూటీ సిఈఓ ఆదిశేషరెడ్డి, జిల్లా గ్రామ వార్డు సచివాలయం అధికారి సుశీల దేవి, ఎల్డిఎం విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *