Breaking News

జిల్లాలో క్రీడా రంగానికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తాం…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో క్రీడా రంగానికి అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. వరుసగా 8 వ రోజు మంగళవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ప్రత్యేక ఉచిత యోగా శిక్షణా తరగతులలో జిల్లా కలెక్టర్ పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ప్యారీస్ లో జరుగుతున్న ఒలంపిక్స్ క్రీడలు పురస్కరించుకొని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఏర్పాటుచేసిన ఒలంపిక్స్ ఫోటోబోర్డుతో సెల్ఫీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సెల్ఫీ తీసుకున్నారు. ప్యారీస్ లో జరుగుతున్న ఒలంపిక్ క్రీడల్లో మన భారతదేశానికి చెందిన క్రీడాకారులు బాగా రాణించి పతకాలు సాధించి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన భారతదేశానికి చెందిన మను బాకర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించడం గర్వించదగ్గ విషయం అన్నారు. జిల్లాలో క్రీడాకారులకు అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తామన్నారు. మండల కేంద్రమైన నాగాయలంకలో కేనోయింగ్, కియా కింగ్ జల క్రీడలను ప్రోత్సహించేందుకు అసంపూర్తిగా ఉన్న క్రీడా శిక్షణా అకాడమీ భవనాన్ని పూర్తి చేసెలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, జిల్లా క్రీడల చీఫ్ కోచ్ ఝాన్సీ లక్ష్మి, జిల్లా పశుసంవర్ధక అధికారి శ్రీనివాసరావు, జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్, సమాచార పౌర సంబంధాల శాఖ డిడి యమ్ వెంకటేశ్వర ప్రసాద్, వ్యవసాయ శాఖ ఏడి పార్థసారథి, యోగా గురువులు ముదిగొండ శాస్త్రి మద్దాల చింతయ్య, శీలం రమేష్ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *