Breaking News

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించండి

-జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో యువతకు ఉపాధి కల్పించే దిశగా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళికను రూపొందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం, కలెక్టరేట్ ఆవరణలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా వృత్తి నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికల గురించి చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో నిరుద్యోగ యువత, వారు కోరుకుంటున్న రంగంలో దానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించి, వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా, జిల్లాలో స్కిల్ సెన్సస్ నిర్వహించి, జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఇంజనీరింగ్ కోర్సులు చేసిన వారిని గుర్తించి వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.

అలాగే, జిల్లాలో ఉన్న పెద్ద పరిశ్రమలకు, కంపెనీలకు, వ్యాపార సంస్థలను సంప్రదించి, వారి అవసరాలకనుగుణంగా, డిమాండ్ ఉన్న కోర్సులను గుర్తించి, జిల్లాలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇప్పించి, వారికి ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ పరిశ్రమలు, ఎంప్లాయిమెంట్, డిఆర్డిఏ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా, HCL Techbee ప్రోగ్రాం ద్వారా, 2023-2024 లో ఇంటర్మీడియెట్ లో Non-Maths గ్రూప్స్ నందు 75% మరియు ఆపైన ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు, ఆగష్టు 2 న లేడీ ఆంఫ్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు నిర్వహించనున్న జాబ్ మేళాకు జిల్లా వ్యాప్తంగా, విస్తృత ప్రచారం కల్పించాలని, అన్ని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు సమాచారాన్ని చేరవేయాలని అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో, డిస్ట్రిక్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ కన్వీనర్ డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, DPO ఎస్.వి.నాగేశ్వర్ నాయక్, ఆర్. వెంకట్రావ్, జిఎం, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్, సీతారాం, జెడ్ఎమ్, ఎ పి ఐ ఐ సి, డి.విక్టర్ బాబు జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి, ఎస్. శ్రీనివాసరావు, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి, సుమలత, జేడీఎం, సీడాప్, ఎడి న్యాక్ పవన్ కుమార్, స్కిల్ హబ్ మరియు స్కిల్ కాలేజీ ప్రిన్సిపల్స్, అనిల్ కుమార్, HCL సంస్థ ప్రతినిధి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, డీడీ, సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్, మైనారిటీ కార్పొరేషన్ ఈడీలు, ఏపీ ఎస్ఎస్డిసి, నాక్, సీడ్ యాప్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *