Breaking News

ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే ఇసుక రవాణా చేయండి… : జాయింట్ కలెక్టర్ నిధి మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందని వాహనదారులు ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు రవాణా చేసి ఇసుకను రవాణా చేసి ప్రజలకు ఇసుక అందుబాటులో ఉంచాలన్న ఆశయంతో భాగస్వాములు కావాలని జాయింట్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు.

ఇసుక రవాణా రేట్ల నిర్దారణ పై ట్రాక్టర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లతో జాయింట్ కలెక్టర్ నిధి మీనా మంగళవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరం నందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా నిధి మీనా మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కీసర, మొగలూరు, అల్లూరుపాడు, కొడవటికల్లు, మగాల్లు, అనుమంచిపల్లి తదితర ఆరు డిపోల ద్వారా ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ప్రజ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అమలు చేసే ఉచిత ఇసుక విధానానికి తోడ్పాటునందిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు ప్రజలకు ఇసుకను రవాణా చేసేందుకు సహకరించాలని జాయింట్ కలెక్టర్ ట్రాక్టర్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులకు తెలిపారు. ఇసుక రవాణాకు సంబంధించి వాహనదారులు మైలేజి, డీజిల్, టోల్ గేట్స్, ఇతర అన్ని ఖర్చులతో కలిపి ట్రాక్టర్ ద్వారా ఒక యూనిట్ ఇసుకను రవాణా చేసేందుకు పది కిలోమీటర్లలోపు 800 రూ., పది కిలోమీటర్ల నుండి 20 కిలోమీటర్లు రూ. 1500, 20 కిలోమీటర్ల పై బడిన ప్రతి కిలోమీటరుకు టన్నుకు 50 రూపాయలు అదనంగా వసూలు చేయాలన్నారు. 6 టైర్స్ లారీ ద్వారా రెండు యూనిట్ల ఇసుకను పది కిలోమీటర్ల లోపు 1500 రూపాయలు, పది కిలోమీటర్ల నుండి 20 కిలోమీటర్ల లోపు 2300 రూ. 20 కిలోమీటర్లు దాటి ప్రతి కిలోమీటరుకు టన్నుకు 80 రూపాయలు అదనంగా వసూలు చేయాలన్నారు. 10 టైర్స్ లారీ ద్వారా 4 యూనిట్లు ఇసుకను సరఫరా చేసేందుకు పది కిలోమీటర్ల లోపు రూ. 2000, పది నుండి 20 కిలోమీటర్ల లోపు రూ. 3000, 20 కిలోమీటర్లు దాటి ప్రతి కిలోమీటరుకు టన్నుకు 100 రూపాయలు అదనంగా వసూలు చేయాలని, 12 టైర్స్ వాహనం ద్వారా 5 యూనిట్లు ఇసుక రవాణకు 10 కిలోమీటర్ల లోపు రూ. 2500, పది కిలోమీటర్లు దాటి 20 కిలోమీటర్ల లోపు 3600 రూపాయలు 20 కిలోమీటర్లు పైబడిన ప్రతి కిలోమీటరుకు టన్నుకు 110 రూపాయలు చొప్పున అదనంగా రవాణా చార్జీల కింద వాహన దారులు వసూలు చేయాలన్నారు. రవాణా శాఖ అధికారులు ఇసుక రవాణాపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు విరుద్ధంగా అధిక రేట్లు వసూలుచేసే వాహనదారులపై రవాణా శాఖ అధికారులు నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ నిధి మీనా సూచించారు.

సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ ఎం. పురేంద్ర, మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, ది. కృష్ణా సాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాంబిరెడ్డి, విజయవాడ సాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. శ్రీనివాసరావు, విజయవాడ అర్బన్ సాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి. వెంకటేశ్వరావు, భూగర్భ గనులు, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *