Breaking News

సహకర సంఘాలు బలోపేతం చెయ్యాలి

-ఆడిటింగ్, రికార్డుల నిర్వహణ పై దృష్టి పెట్టాలి
-ఎఫ్ పి వో ల ఏర్పాటు పై వ్యవసాయ అనుబంధ శాఖలు ప్రతిపాదనలు పంపాలి
-నాబార్డ్ అధ్వర్యంలో ఎన్ జి వో లతో సమావేశం ఏర్పాటు చెయ్యాలి
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సహకార రంగాన్ని పటిష్ట పరచడం , కార్యకలాపాలను సమర్ధ నిర్వహణా కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం డి సి డి సి (జిల్లా సహకార అభివృద్ధి కమిటీ) సమావేశం కు కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సహకార సంఘాలు పూర్తి స్థాయిలో చురుగ్గా ఉండేలా చూడాలని ఆదేశించారు. సహకార సంఘాల వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరో ఆధారపడి ఉంటారని పేర్కొన్నారు. ప్రతి సహకార సంఘాలు నిర్వహించే కార్యకలాపాల విషయములో ఆడిటింగ్, రికార్డుల నిర్వహణ సక్రమంగా నిర్వహించాల్సి ఉందన్నారు. సహకార రంగం పటిష్ఠం పరచడంలో ఉత్పత్తి, మార్కెటింగు,సామర్ధ్యం పెంపు అత్యంత కీలకమైన అంశాలని పేర్కొన్నారు. ఆ మేరకు వ్యవసాయ, హర్టీకల్చర్, ఫిషరీస్, మార్కెటింగు తదితర విభాగాలు ఆధ్వర్యంలో ఎఫ్ పి వో లు ఏర్పాటు చెయ్యడం ద్వారా సహకార రంగాన్ని మరింత బలోపేతం చెయ్యడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. స్థానికంగా ప్రత్యేక ప్రొడక్ట్ ను గుర్తించడం ద్వారా మార్కెటింగు సౌకర్యాలు కల్పించటం సాధ్యం అవుతుందని తెలిపారు. అందులో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖల అధ్వర్యంలో ఎన్ జి వో లను గుర్తించి కనీసం ఒక ఎఫ్ పి వో లో 300 మంది సభ్యులు ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు. నాబార్డ్ అధ్వర్యంలో ఎన్ జి వో లతో సమావేశం ఏర్పాటు చేసి ఎఫ్ పి వో లను గుర్తించాలన్నారు.

ఈ సమావేశంలో ఇంచార్జీ జేసి /డి ఆర్వో ఆర్. నరసింహులు, జిల్లా సహకార అధికారి ఆర్ . శ్రీరాములు నాయుడు, నాబార్డు , ఎల్ డి ఎమ్, వ్యవసాయ, మార్కెటింగు అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *