Breaking News

ఆగస్టు 25 న జే సి యు బి ఎన్నికలు

-ఆగస్టు 9 న ఎన్నికల షెడ్యూల్ విడుదల
-కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం ది జాంపేట కో- ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్   యొక్క పాలకవర్గం ఎన్నికలు ఆగస్టు 25 న జరుపుటకు ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 9 న విడుదల చేయనున్నట్లు కలెక్టరు పి. ప్రశాంతి తెలిపారు. ది జాంపేట కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నిర్వహణా విషయంలో షెడ్యూల్ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ పి. ప్రశాంతి మంగళవారం కలెక్టరేట్ లో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, జాంపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ ఎన్నికలలో భాగంగా ఓటు వేసేందుకు గుర్తించే  ప్రదేశాలు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగు కేంద్రాల ఏర్పాటు ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎలక్షన్ ఆధారటి పి. ప్రశాంతి స్పష్టం చేశారు. బ్యాంకు నియమాలను అనుసరించి జూన్ 8 వ తేదీ నాటికీ , అంతకు ముందు బ్యాంకు నందు చేరిన సభ్యులు ఓటు వేయుటకు అర్హులు అని తెలిపారు.  జూలై 8వ తేది నాటికి వాయిదా మీరిన బకాయిదారులు (NPA) ఓటు వేయుటకు అనర్హులు అని తెలియ చేసారు. సంబంధిత జాబితా బ్యాంకు బ్రాంచిల యందు ప్రదర్శించడం జరిగిందన్నారు.  జాంపేట మెయిన్ ,  మోరంపూడి, ధవళేశ్వరం, సీతంపేట, అనపర్తి, పెద్దా పురం, కాకినాడ, గోకవరం, ఏలూరు, కొవ్వూరు నందు ప్రాధమిక ఓటర్ల జాబితా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.   అందుకనుగుణంగా ఆగస్టు 2 వ తేదీన ప్రాధమిక ఓటర్ల జాబితా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.   బ్యాంకు వారు జారీచేసిన గుర్తింపు కార్డు మరియు కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం వారు జారీచేసిన ఏదైనా ఒక ఫోటో గుర్తింపు కార్డు విధిగా తీసుకువచ్చి ఎన్నికలు జరిగే రోజు తమ ఓటు హక్కును వినియోగించు కోవచ్చును. బ్యాంకు యొక్క ఫోటో గుర్తింపు కార్డు తప్పనిసరి అని పేర్కొన్నారు.

జే సి యు బి ఎన్నికల ప్రక్రియ లో ముఖ్య తేదీలు:
2024 ఆగస్టు 9 ఎన్నికల నోటిస్ జారీ, ఓటర్లు జాబితా విడుదల

ఆగస్టు 16 ఉదయం 11 నుంచి సాయంత్రం 5 నామినేషన్లు స్వీకరణ, అనంతరం పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటన

ఆగస్టు 17 న నామినేషన్లు స్క్రూటినీ , అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటన

ఆగస్టు 18 న ఉదయం 11 నుంచి 5 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు , అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థుల జాబితా ప్రకటన , గుర్తుల కేటాయింపు ఏకగ్రీవం అయిన అభ్యర్థుల వివరాలు ప్రకటన

ఆగస్టు 25 ఉదయం 8 నుంచి సా.4 గంటల వరకు పోలింగ్

ఆగస్టు 26 న ఉదయం 8.00 నుంచి ఓట్ల లెక్కింపు, అనంతరం ఫలితాలు ప్రకటన

ఆగస్టు 27 ఉదయం 8 నుంచి ఖాళీగా ఉన్న కో ఆప్షన్ సభ్యులు భర్తీ ప్రక్రియ

ఈ సమావేశంలో డిఆర్వో జి. నరసింహులు, ది.జాంపేట కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ కార్యదర్శి /ముఖ్యకార్యనిర్వహణాధికారి మద్దాల విజయ ప్రతాప్ ,డిసివో డి. శ్రీరాములు నాయుడు, ఎన్నికల అధికారి ఎమ్. జనార్ధన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *