Breaking News

జిల్లాలో ప్రశాంతంగా ఏపిపిఎస్సి డిపార్ట్ మెంట్ పరీక్షలు

-ఉదయం పూట పరీక్షలకి హాజరైన 203 మంది ఉద్యోగులు , మధ్యాహ్నం హాజరైన 177 మంది
– డీ ఆర్వో జి. నరసింహులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీపి ఎస్సి వారి అధ్వర్యంలో నిర్వహించిన శాఖాపరమైన పరీక్షలు తొలి రోజు రెండూ సెషన్స్ ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా రెవిన్యూ అధికారి / ఏపిపిఎస్సీ జిల్లా నోడల్ అధికారి జి. నరసింహులు తెలియ చేసారు. మంగళవారం స్థానిక అయాన్ డిజిటల్ జోన్ లూథర్‌గిరి నందు పరీక్షల నిర్వహణ తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భం గా నరసింహులు మాట్లాడుతూ, మంగళవారం రెండు సెషన్స్, బుధవారం ఉదయం సెషన్ లో శాఖాపరమైన పరీక్షలను నిర్వహించడానికి సమన్వయ శాఖలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఉదయం పరీక్షల కోసం 241 మంది దరఖాస్తు చేసుకోగా 203 మంది హాజరు కాగా 38 గైరాజరైనట్లు తెలిపారు. మధ్యాహ్నాం సెషన్ లో 211 మందికీ గాను , 177 మంది హాజరు కాగా, 38 మంది గైరాజారు అయినట్లు తెలిపారు.

ఆగస్టు 31 బుధవారం ఉదయం పూట 577 మంది ఉద్యోగస్తులు ఏపీపీ ఎస్సి నిర్వహించే శాఖ పరమైన పరీక్షలకు హాజరుకానున్నట్లు డి ఆర్వో నరసింహులు తెలిపారు. ఏపీపి ఎస్సి సభ్యులు ఎన్. సోనీ వుడ్ బుధవారం జిల్లాలో ఎపిపిఎస్సి శాఖ పరమైన పరీక్షల నిర్వహణా తీరును తనిఖీ చేయనున్నట్లు తెలియ చేశారు. ఆగస్టు 31 బుధవారం ఉదయం 6 గంటలకి కాకినాడ నుంచి బయలుదేరి 9 గంటలకి రాజమహేంద్రవరం చేరుకుంటారు. అనంతరం అయాన్ డిజిటల్ జోన్ లూథర్‌గిరి నందు పరీక్ష కేంద్రాన్ని సందర్శించడం జరుగుతుంది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *