Breaking News

గోదావరి ముంపు బాధితులకు పాపులర్‌ షూ మార్ట్‌ వారి సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జులై 18,19,20వ తేదీలలో కురిసిన భారీ వర్షాల వలన గోదావరి నదికి ఉధృతంగా వచ్చిన వరద కారణంగా పెదవాగు ప్రాజెక్టుకు గండి పడి ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుకునూరు మండలాలలో 15 గ్రామాలు పూర్తిగా నీట మునిగి ఆ గ్రామాలలోని వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన గోదావరి ప్రాంతంలో ముంపు బాధితులకు అందించేందుకు పాపులర్‌ షూ మార్ట్‌ వారు 500 దుప్పట్లు, 500 టవల్స్‌, 500 లుంగీలు సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి అందజేసారు. వీటితోపాటు ఎఫ్ట్రానిక్స్ వారు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ద్వారా ఇచ్చిన 200 చీరలను సిపిఐ రాష్ట్ర నాయకత్వం ఈ నెల 31న బాధితులకు పంపిణి చేయడం జరుగుతుంది. సిపిఐ రాష్ట్ర నాయకత్వం పాపులర్ షూ మార్ట్, ఎఫ్ట్రానిక్స్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాపులర్‌ షూ మార్ట్‌ అధినేత చుక్కపల్లి అరుణ్‌కుమార్‌, చుక్కపల్లి అవినాష్‌, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, అక్కినేని వనజ, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాధ్‌, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనేపూడి శంకర్‌, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, ఎఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు, ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్‌ బాబు, ఎన్టీఆర్ జిల్లా యువజన నాయకులు ఎల్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *