Breaking News

జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టానుసారం విష ప్రచారం తగదు… : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2019 నుంచి 2023 వరకు జగన్మోహన్ రెడ్డిపాలనలో ఆచూకీ లభించని మహిళల సంఖ్య 663 అని వైయస్సార్సీపి నాయకులు పోతిన వెంకట మహేష్ అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 30000 కాదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోమ్ శాఖ జూలై 30.2024 న తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్థసారథి మరియు కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకమైన సమాధానమిచ్చారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 వేల మంది మహిళలు కనపడకుండా పోయారని గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టానుసారం విష ప్రచారం చేశారు ఇది పచ్చి అబద్ధం. 30 వేల మంది మహిళల మిస్సింగ్ పై కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని మహిళలను అడ్డం పెట్టుకొని కుట్ర రాజకీయం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్థసారథి మరియు కృష్ణదేవరాయలు పార్లమెంటు లో ప్రశ్న.1351 తేది.జూలై 30.2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా 2019 నుండి 2023 వరకు వయసు& జిల్లాల వారీగా ఆచూకీ లభించని మహిళల వివరాలు తెలపాలని అదేవిధంగా ఈ విషయంపై అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపట్టారా అని పార్లమెంట్లో లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖ లిఖితపూర్వకమైన సమాధానం పూర్తిగణంకాలతో ఇచ్చింది. ఈ గణాంకాలు అన్నింటిని రాష్ట్ర ప్రజలు ఒకసారి పరిశీలించాలి. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో మహిళా మిస్సింగ్ కేసులు 18 సంవత్సరాల లోపు మరియు 18 సంవత్సరాల పైబడి ఇంతవరకు ఆచూకీ లభించని వారి సంఖ్య 663 పవన్ కళ్యాణ్ చెప్పినట్టు 30,000 కాదు. 2019 నుంచి 2023 వరకు రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళా మిస్సింగ్ కేసుల పట్ల అద్భుతంగా పనిచేశారని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోంశాఖ తెలియజేసింది. మహిళా మిస్సింగ్ కేసులు పట్ల అబద్ధపు ప్రచారాలు చేసిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని మహిళలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

Check Also

యధావిధిగా సెప్టెంబరు 23 సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *