Breaking News

ఉపాధి హామి పనులతో భూగర్భ జలాల పెంపు..

-ప్రతి ఒక్కరికి ఉపాది హామి ద్వారా పని కల్పిస్తున్నాం..
-జిల్లాలో ఉద్యాన తోటలకు 288 పంట కుంటల నిర్మాణం..
-జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఉపాధి హామి పథకం కింద పని కోరిన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తున్నామని జిల్లాలో ఉద్యాన రైతుల సౌకర్యార్ధం ఉద్యాన తోటలలో 288 పంట కుంటలు నిర్మాణం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన తెలిపారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం ద్వారా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మైలవరం మండలం పుల్లూరు గ్రామ సమీపంలో ఉల్లిబోయిన సోమయ్యకు చెందిన మామిడి తోటలో నిర్మిస్తున్న పంట కుంటను బుధవారం జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సృజన మాట్లాడుతూ జిల్లాలో ఉపాధి హామి పథకం ద్వారా పని కోరిన ప్రతి ఒక్కరికి పని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది 82 లక్షల పని దినాలను కల్పించాలన్నది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 60 లక్షల పని దినాలను కల్పించడం జరిగిందన్నారు. ఉపాధి హామి పనులలో భాగంగా అమృత సరోవర్‌ చెరువుల తవ్వకం, పంట కుంటల నిర్మాణం, కందకాల తవ్వకం, రూఫ్‌ వాటర్‌ హర్వెస్టింగ్‌ స్టక్చర్ల నిర్మాణం, కమ్యూనిటీ సోప్‌ పిట్ల నిర్మాణం, చెరువు, కాలువ గట్లపై మొక్కల పెంపకం పనులను చేపట్టి కూలీలకు ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉద్యాన రైతుల సౌకర్యార్ధం తోటలలో పంట కుంటల నిర్మాణం చేపట్టామన్నారు. జిల్లాలో 447 పంట కుంటల నిర్మాణానికి అనుమతులు మంజూరు కాగా ఇందులో 288 పంట కుంటల నిర్మాణాన్ని చేపట్టి 80 నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క పంట కుంట పై భాగంలో 9 మీటర్ల పొడవు`వెడల్పు, లోపలి భాగం 5 మీటర్ల పొడవు` వెడల్పు 2 మీటర్ల లోతు విస్తీర్ణంలో నిర్మించడం జరుగుతుందని ఒక్కొక్క పంట కుంట నిర్మాణానికి 150 పని దినాలు కల్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. పంట కుంటల నిర్మాణం వలన కురిసిన వర్షపు నీటిని రైతులు నిల్వ చేసుకుని మొక్కల పెంపకాన్ని ఉపయోగించుకోవడంతో పాటు భూగర్భ జలాల కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మల్లె, గులాబి పూల తోటలు, మామిడి, జామ, నిమ్మ, సపోట, నారింజ సీతాఫలం, డ్రాగన్‌ పూట్‌, జీడిమామిడి దానిమ్మ, నేరేడు, ఆపిల్‌బేర్‌, మునగ, పామాయిల్‌ వంటి పండ్ల తోటలు పండిరచే ఉద్యాన రైతులు పంట కుంటల (ఫాంపాండ్‌ )ను నిర్మించుకునేందుకు ముందుకు రావాలని కలెక్టర్‌ డా. సృజన తెలిపారు.
పంట కుంట పరిశీలనలో కలెక్టర్‌ వెంట జాతీయ ఉపాధి హామి పథకం ప్రాజెక్టు డైరెక్టర్‌ జె. సునీత, డిపివో యన్‌.వి. శివ ప్రసాద్‌ యాదవ్‌, యపిడివో పి. శ్రీనివాసరావు, ఏపివో వెంకటేశ్వరరావు, ప్లాంటేషన్‌ మేనేజర్‌ కె. ఉషారాణి, ఇంజనీరింగ్‌ కన్స్‌ల్‌టెంట్‌ ఎస్‌ వంశీ కృష్ణ, డిప్యూటీ తహాశీల్థార్‌ శ్రీహరి, పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *