Breaking News

రెవెన్యూ, ఎన్హెచ్ఎఐ అధికారులు సమన్వయంతో పురోగతి సాధించాలి…

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారుల పెండింగ్ పనులన్నింటినీ ఒక నిర్దిష్ట ప్రణాళికతో టైం లైన్ ప్రకారం పురోగతి ఉండేలా సమన్వయంతో పనితీరు ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని తిరుపతి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత ఎన్హెచ్ఎఐ, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు కలెక్టర్ గారు జెసి శుభం బన్సల్ తో కలిసి తిరుపతి జిల్లాలోని జాతీయ రహదారుల పెండింగ్ పనుల పురోగతిపై రెవెన్యూ డివిజనల్ అధికారులు, తాసిల్దార్లు, పిడి ఎన్హెచ్ఎఐ అధికారులు తిరుపతి, నెల్లూరు, చెన్నై వారితో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల పెండింగ్ పనులన్నింటినీ ఒక నిర్దిష్ట ప్రణాళిక తయారు చేసుకుని ఒక్కొక్క పనికి టైం లైన్ నిర్దేశించుకుని ఆ ప్రకారం పురోగతి ఉండేలా సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులు, తాసిల్దార్లు, పిడి ఎన్హెచ్ఎఐ అధికారులు తిరుపతి, నెల్లూరు, చెన్నై వారు సమన్వయంతో పనిచేసి పురోగతి సాధించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని, జాతీయ రహదారుల పురోగతిపై రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఆర్డీఓ లు నిశాంత్ రెడ్డి, కిరణ్ కుమార్, రవి శంకర్ రెడ్డి, ఎన్హేచ్ఎఐ పిడి లు తిరుపతి వెంకటేష్, నెల్లూరు పిడి కొండయ్య చందు, చెన్నై పిడి రవీంద్ర రావు, కలెక్టరేట్ ఇంచార్జ్ సెక్షన్ సూపరింటెండెంట్ భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *