అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లేవారు ముందుగా ప్రయాణం ముందు అవగాహన శిక్షణ తీసుకుంటే సురక్షితమని మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఏజెన్సీల ద్వారా మాత్రమే గల్ఫ్ దేశాలకు వెళ్లాలని విదేశీ వ్యవహారాల శాఖచే గుర్తించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ap లిమిటెడ్ ఏజెన్సీ యొక్క జనరల్ మేనేజర్ బిఆర్ క్రాంతి కుమారి ఇవాళ ఓంకాప్ ఆఫీసు విజయవాడలో జరిగిన ఆరు జిల్లాల ఉపాధి కల్పనా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ చే కేటాయించబడిన ప్రయాణ ముందస్తు అవగాహన శిక్షణ కేంద్రాల అయినటువంటి 6 జిల్లాల జిల్లా ఉపాధి కార్యాలయాలు కడప, విజయవాడ, శ్రీకాకుళం, చిత్తూరు, విశాఖపట్నం, కాకినాడ ఏర్పాటు చేసిన దాని గురించి మరియు విదేశాలకు వెళ్లేవారు సరైన అవగాహన మరియు శిక్షణ లేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాళ్లకు సరైన అవగాహన మరియు శిక్షణ నైపుణ్యం కల్పించి సరైన రీతిలో విదేశాలకు పంపడానికి ఓంకాప్ మరియు ఉపాధి కల్పనా శిక్షణ శాఖల ఆధ్వర్యంలో ఉచిత అవగాహన శిక్షణ, ఉద్యోగ సహకారం అందించుటకు కృషి చేయాలని అవగాహన శిక్షణ సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఓంకాప్ యొక్క జనరల్ మేనేజర్ బిఆర్ క్రాంతి కుమార్, హెచ్ఆర్ మేనేజర్ ఎం సతీష్ బాబు, సీనియర్ అసిస్టెంట్ జి .గోపి మరియు విశాఖపట్నం జిల్లాకు చెందిన జూనియర్ జిల్లా ఉపాధి కల్పనాధికారిని శ్రీమతి మనోరమ గారు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన జిల్లా జూనియర్ ఉపాధి కల్పన అధికారి వై రవీంద్ర కుమార్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన సీనియర్ అసిస్టెంట్ టీ. విద్యాసాగర్ చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ అసిస్టెంట్ వివేక్ కడప జిల్లాకు చెందిన టైపిస్ట్ శివప్రసాద్ మరియు జిల్లా కాకినాడ జిల్లాకు చెందిన జూనియర్ ఉపాధి కల్పనా అధికారిని శిరీష ప్రత్యేకంగా జూమ్ కాల్ లోపాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …