Breaking News

2015లో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే సీఆర్డీయే పరిధి : సీఎం నారా చంద్రబాబు నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
2015లో ఇచ్చిన జీవో నెంబర్ 207 ప్రకారం 8,352 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే సీఆర్డీయే ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో గుర్తించిన విస్తీర్ణం ప్రకారమే సీఆర్డీఏ పరిధి కొనసాగుతుందని పేర్కొన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 36వ అథారిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 12 అంశాలపై సీఎం చర్చించారు. గతంలో 130 సంస్థలకు జరిగిన భూ కేటాయింపులు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. గతంలో ల్యాండ్ పొందిన వాళ్లు మళ్లీ ఎన్నిరోజుల్లో నిర్మాణాలు చేపట్టాలి అనే అంశంపైనా చర్చించారు. సంపద సృష్టి కేంద్రంగా అమరావతి ప్రాంతాన్ని మార్చేవారికే భూ కేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. గతంలో జరిపిన భూ కేటాయింపులపై పున:సమీక్షించి ఆసక్తి చూపే సంస్థలకే అవకాశం ఇవ్వాలన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ఎటువంటి సంస్థలను ఆహ్వానించాలి, ఎవరికి భూములు కేటాయించాలి అనే అంశంపైనా సీఎం చర్చించారు. దేశంలో టాప్ 10 కాలేజ్ లు, టాప్ 10 స్కూల్స్, టాప్ 10 ఆసుపత్రులు అమరావతిలో ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపిన పలు గ్రామాలను మళ్లీ రాజధాని పరిధిలోకి తీసుకురావాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గత ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై లోతైన సమీక్ష జరుపుతున్నామని అధికారులు వివరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం, నాలుగు లైన్లుగా కరకట్ట రోడ్డు విస్తరణపై ముందుకెళ్లాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ లో భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చే కౌలును మరో ఐదేళ్ల పొడిగించాలని నిర్ణయించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *