Breaking News

ఉద్యాన పంటల’కు ప్రభుత్వ ప్రోత్సాహం – 2023-24 సం.పు నిధుల విడుదల

-కొత్తగా 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్ ఫాం సాగు చేసిన రైతులకి రూ.419 లక్షలు
-సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద రూ.28.6 లు విడుదల
-రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద రూ.78.75 లక్షలు
-50 శాతం సబ్సిడీ పై హై బ్రీడ్ విత్తనాల పంపిణీ
-కలక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యాన పంటల’కు ప్రభుత్వ పెద్ద ఎత్తున ప్రోత్సాహం అందించే దిశలో 2023-24 ఏడాదికి చెందిన నిధుల విడుదల చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. అందులో భాగంగా ప్రభుత్వం ఉద్యాన పంటల సాంగుకు తగిన ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. దీని కొరకు ఇటీవల 2023-24 సంవత్సరానికి సంబంధించి తూర్పు గోదావర జిల్లాలో నిర్దేశించిన భౌతిక లక్ష్యాలకు అనుగుణంగా రైతులకు అందచేయ వలసిన ఆర్థిక సహయం రైతుల బ్యాంకు ఖాతాలకి జమ చేయుట జరుగుచున్నట్లు పేర్కొన్నారు.

నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్ ఫాం 2023 – 24 పథకం నందు జిల్లాలో కొత్తగా ఆయిల్ ఫాం నాటిన రైతులకు సబ్సిడీ తో కూడి ఆయిల్ ఫాం మొక్కలు పూర్తి రాయితితో అందించడం జరిగింది. అందులో భాగంగా 3000 హెక్టార్లలో సాగు చేసేందుకు ఎరువుల నిమిత్తం వారి బ్యాంకు అకౌంట్లకు పిఎఫ్ఎంఎస్ (PFMS) ద్వారా జమ చేయుట జరుగుచున్నది. ఇప్పటి వరకు ₹.419 లక్షలు జమ అయినట్లు తెలిపారు.

సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం (Mission for Integrated Development of Horticulture (MIDH] :-
సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం 2023-24 సంవత్సరంలో మామిడి, జీడిమామిడి, టిష్యూ కల్చర్ అరటి, ప్లాస్టిక్ మల్చింగ్, కోకో మొదలగు పంటలు సాగు చేయు రైతులకు రూ.28.6 లక్షలు సబ్సిడీ మొత్తం అందచేయుటకు నిధులు విడుదల చేయుట జరిగినదని కలెక్టర్ తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు రూ.18.87 లక్షలు రైతుల ఖాతాలకు PFMS (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)ద్వారా జమచేయుట జరిగినది.

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం { RKVY] :-
ఆర్కేవివై పధకం ద్వారా జిల్లాలో నెలకొల్పిన వివిధ ఉద్యాన పంటల సేకరణ కేంద్రం నిర్మాణానికి ఒక్కో సెంటరుకు రూ.5.25 లక్షల చొప్పున జిల్లా వ్యాప్తంగా 15 కలెక్షన్ సెంటర్లకు రూ.78.75 లక్షల నిధులు మంజూరు చేయుట జరిగినది. ఇంకా మిగిలిన రైతులకు మరొక విడతలో రాయితీ సొమ్ము అందించడం జరుగుతుందనీ కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *