Breaking News

స్వతంత్ర బీసీ ఉద్యమం లక్ష్యంగా రౌండ్ టేబుల్ సమావేశం

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కొన్ని బి.సీ సంఘాల అధిపత్య కులాలు, రాజకీయ పార్టీలను ఎన్నికల్లో బలపరుస్తూ బి.సీ రాజ్యాధికార సామాజిక న్యాయానికి తీరని నష్టం కలిగిస్తున్నాయని ఇటువంటి పరిస్థితుల్లో బిసీలోని ఇతర వర్గాలకు ప్రయోజనం కలగాలి అంటే స్వతంత్ర బీసీ ఉద్యమ నిర్మాణం చేయాలని సామాజిక ఉద్యమకారుడు (హైకోర్టు న్యాయ వాది) వ.కోటేశ్వరరావు(వైకే) పిలుపు నిచ్చారు. ఆదివారం గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో స్వతంత్ర బి.సీ ఉద్యమ నిర్మాణం చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించిన వైకే మాట్లాడుతూ స్వతంత్ర బి. సీ ఉద్యమ ఆవశ్యకత గురించి గత ఎన్నికల సందర్భంలో గానీ అంతకు ముందు గానీ బి. సీలు ఒక స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదగలేక పోవ డాన్ని కొన్ని బి.సీ సంఘాలు ఆధిపత్య కులాల పార్టీలకు పనిచేసిన తీరుతెన్నెలను వైఖరినీ వివరించారు. చర్చల్లో పాల్గొన్న ప్రతినిధులు స్వతంత్ర బి.సీ ఉద్యమం లేకుండా బి.సిలకు ఎన్నటికీ రాజ్యాధికారం రాదు కనుక ఇప్పటినుండి అయినా స్వతంత్ర బి.సీ నిర్మాణం వైపుగా సాగిపోవాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమం నిర్వహణకై 21 మందితో ఒక ఆర్గనైజేషన్ కమిటీ ఎన్నుకున్నారు. స్వతంత్ర బి.సీ ఉద్యమ భావజాలాన్ని విస్తృతంగా బి.సి ప్రజానికంలోకి తీసుకువెళ్లేందుకై సెప్టెంబర్ 14,15 తేదీలలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో నగర బి.సీ నాయకులు నమ్మి అప్పారావు, బి.సీ ప్రతినిధులు పి.వి రమణయ్య, వీరవల్లి శ్రీనివాసరావు, కే.సుబ్రహ్మణ్యం, పితా రమేష్, పెండ్యాల నారాయణ, భాస్కర్ గౌడ్, సూరిబాబు, బొబ్బిలి సూర్యనారాయణ, ఎర్రాకుల తులసి రామ్, సీ.శంకర్, రేణుకా దేవి, శిరీష, సి. హెచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *