Breaking News

స్నేహం చారిటీస్ వారి సేవలు అభినందనయం అడ్డూరి శ్రీరామ్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
స్నేహం చారిటీస్ వారు విద్యార్థులకు సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. బందర్ రోడ్ లోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో స్నేహం చారిటీస్ వారు ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఐదవ వార్షికోత్సవ ఉపకార వేతన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ వి నారాయణరావు హాజరయ్యారు, ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా, వెనుకబడిన నేపద్యాల నుండి అర్హులైన విద్యార్థులకు సామాజిక బాధ్యతలో భాగంగా స్నేహం చారిటీస్, వారు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఉపకార వేతనం అందించడం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. స్నేహం చారిటీస్ వారికి ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఏటా వందమంది విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ 2 వేలు చొప్పున అందించడం పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం శుభ పరిమాణమని స్నేహం చారిటీస్ వారు అందిస్తున్న సేవలు వెలకట్టలేమన్నారు. విద్యార్థులకు ఉపకార వేతనాలను ప్రధానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని స్నేహం చారిటీస్ వారికి తమ వంతు తోడ్పాటునందిస్తామన్నారు.
కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ వి నారాయణరావు మాట్లాడుతూ ఉపకార వేతనం అనేది ఒక వ్యక్తి కోసం కావచ్చు కానీ ఆ వ్యక్తి చూపే ప్రతిభని ప్రోత్సహించాలన్నారు, ఉపకార వేతనం అందుకోవడాన్ని విద్యార్థులు గౌరవంగా భావించాలన్నారు. విద్యార్థులందరూ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఆత్మ న్యూనత భావాన్ని పోగొట్టుకొని చదువుల్లో రాణించాలని తెలిపారు. మానవసేవే మాధవసేవగా భావించి సేవలందిస్తున్న స్నేహం చారిటీస్ సేవలు అభినందనీయం అన్నారు.
టిడిపి కార్పోరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ విద్యార్థులందరూ ఉన్నత స్థాయికి వచ్చిన తర్వాత భవిష్యత్తు తరాలకు సహాయ పడాలి అన్నారు. స్నేహం చారిటీస్ ఫౌండర్ కె రవీంద్ర మాట్లాడుతూ 469 వారాల నుంచి పేద విద్యార్థులకు నిస్వార్ధంగా సేవలను అందిస్తున్నామని తమ చారిటీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి అధికార ప్రతినిధి గన్నవరపు శ్రీనివాసరావు, బిజెపి పశ్చిమ కన్వీనర్ పొట్టి శ్రీహరి, విద్యార్థులు తల్లిదండ్రులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *