Breaking News

కలెక్టరేట్ పి జి ఆర్ యస్ లో 150 అర్జీలు

-ఇన్చార్జి జెసి జి నరసింహులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి 150 అర్జీలను స్వీకరించడం జరిగిందనీ ఇన్చార్జి జెసి, జిల్లా రెవిన్యూ అధికారి జి నరసింహులు తెలియ చేశారు. సోమవారం పి జీ ఆర్ ఎస్ లో కె ఆర్ ఆర్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్. కృష్ణా నాయక్, టూరిజం ఆర్ డి వి. స్వామి నాయుడు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ టి. రాధిక లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జి. నరసింహులు వివరాలు తెలియ చేస్తూ, ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలలో రెవిన్యూ 42 , పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి 26 , హోం 25, వైద్య ఆరోగ్య 16 , మున్సిపాలిటీ 10 ఇతర శాఖలకు చెందిన 41 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. వీటిలో 139 ఆన్లైన్ లో నమోదు చేసి నట్లు, 11 అర్జీలు ఆఫ్ లైన్ లో నమోదు చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు.

వైద్య పరమైన ప్రత్యేక సహాయం అభ్యర్థనలు కు సంబంధించి ధవళేశ్వరం కి చెందిన పల్నాటి పార్వతి దేవి ప్రస్తుతం ఇస్తున్న దివ్యాంగ పెన్షన్ మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.15 వేల కేటగిరిగా మార్పు కోసం అర్జీ ఇవ్వడం జరిగింది. ఆమె భర్త ముత్యా ల రాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కు రావడం జరిగింది. సంబంధిత వైద్య అధికారులు సదరు అర్జీని స్వీకరించి అర్హత మేరకు తగిన పరీక్షల ను నిర్వహించి తదనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ హామీ ఇవ్వడం జరిగింది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *