Breaking News

వాలంటీర్లూ.. అపోహలొద్దు!

-ఇచ్చిన మాటకు ఎన్డీయే కట్టుబడే ఉంది
-మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వాలంటీర్ల వ్యవస్థపై తెలుగుదేశం పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడే ఉందని సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడిరచారు. వాలంటీర్ల వ్యవస్థను ఎన్డీయే ప్రభుత్వం రద్దు చేయనున్నట్టు ప్రచారంలోకి వస్తున్న కథనాలను ఖండిస్తూ.. సోమవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. వాలంటీర్ల భవిష్యత్‌ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మంత్రి ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఎన్నికలలో ఇచ్చిన ఉద్యోగ భద్రత హామీ, మేనిఫెస్టోలో పొందుపర్చిన అంశాల విషయంలో తెలుగుదేశం పార్టీ వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. వాలంటీర్లు తమ భవిష్యత్‌పట్ల ఎలాంటి భయాందోళనలకూ గురికావాల్సిన పని లేదన్నారు. భయాందోళనలకు గురిచేసే ఎలాంటి తప్పుడు కథనాలనూ వాలంటీర్లు నమ్మవద్దని, కుట్రపూరిత కథనాలతో ఎన్డీయే ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసే దుష్ట చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ సేవల ముసుగువేసి.. వాలంటీర్‌ వ్యవస్థను రాజకీయంగా వాడుకున్నది వైసీపీ పాలకులేనని దుయ్యబట్టారు. ఏడాది కాలంగా వాలంటీర్‌ సేవలను రెన్యువల్‌ చేయకుండా దగా చేసిన గత పాలకులు.. ఇప్పుడు వాలంటీర్ల భవిష్యత్‌నూ దెబ్బకొట్టేందుకు నిరాధార, కుట్రపూరిత కథనాలను ప్రచారంలోకి తేవడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు. అంతేకాదు, ఎన్నికల సమయంలో వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం వాలంటీర్లచేత బలవంతంగా రాజీనామలు చేయించి దగా చేసిన విషయాన్ని ఇక్కడ మర్చిపోకూడదన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనేక విధాలుగా వాలంటీర్‌ వ్యవస్థకు హామీలిచ్చినా.. వైసీపీ పాలకులు మాయచేసి, రెచ్చగొట్టి రాజీనామాలు చేయించి.. వాలంటీర్ల భవిష్యత్‌ను అయోమయంలోకి నెట్టడం వెనుక గత పాలకుల కుట్ర దాగివుందన్న విషయాన్ని వాలంటీర్లు గ్రహించాలన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడివుండే తెలుగుదేశం పార్టీ.. వాలంటీర్లకు ఎలాంటి అన్యాయం చేయదంటూనే, ప్రజా ప్రభుత్వంపై అక్కసుతో వైసీపీ పార్టీ ప్రచారంలోకి తెస్తున్న నిరాధార కథనాలు నమ్మి వాలంటీర్లు భయాందోళనలకు గురికావొద్దని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *