Breaking News

రైతులు సాగు చేస్తున్న ప్రతి పంట ఈ క్రాప్ నమోదు చేయాలి

-జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ క్రాప్ నమోదు పకడ్బందీగా నిర్వహించాలని, రైతులు సాగు చేస్తున్న ప్రతి పంట ఈ క్రాప్ లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ నుండి తాసిల్దారులు మండల వ్యవసాయ ఉద్యాన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈక్రాప్ నమోదు కార్యక్రమం పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు పంట సాయం, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా వంటి ప్రభుత్వ పథకాలు అందాలంటే ఈక్రాప్ డేటా చాలా ముఖ్యం అన్నారు. అందువల్ల ఈ క్రాప్ నమోదు జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలన్నారు. తూతూ మంత్రంగా చేయడం, పంట లేకుండా ఉందని, పండించే పంట బదులు మరో పంట నమోదు, విస్తీర్ణంలో తప్పులు దొర్లితే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. చేసిన ఈక్రాప్ డేటా పై సూపర్ చెక్ ఉంటుందన్నారు. తాసిల్దారు, ఆర్డిఓ, కలెక్టర్ స్థాయిలో ఈ క్రాప్ డేటా వెరిఫికేషన్ సీరియస్ గా జరుగుతుందన్నారు. పండించే పంట వద్దకు వెళ్లి జియో రిఫరెన్స్సింగ్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గ్రామ వ్యవసాయ సిబ్బంది వీఆర్వో అదీకృతం జరగాలన్నారు. ఈ క్రాప్ నమోదు అయ్యాక రైతుల ఈ కేవైసీ చేయాలని అన్నారు. మామిడి వంటి పంటలు సాగు చేస్తున్న భూ యజమానులు వేరే ప్రాంతాల్లో ఉంటారని, వీరికి కూడా ఈక్రాప్ నమోదు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందని, కావున ముందుగానే ఇలాంటి జాబితా సిద్ధం చేసుకుని వీరి నమోదుపై దృష్టి పెట్టాలని అన్నారు.

కౌలు రైతులకు సి సి ఆర్ సి కార్డుల జారీ సంబంధించి గత ఏడాది జిల్లాలో 57 వేల వరకు జారీ చేయగా, ఈ ఏడాది 70 వేల లక్ష్యాన్ని చేరుకోవలసి ఉందన్నారు. గత ఏడాది సిసిఆర్సి జారీ చేసిన రైతులలో చాలావరకు రెన్యువల్ చేయవచ్చని, ఈసారి కొత్తగా ఇవ్వాల్సిన రైతులపై దృష్టి పెట్టాలన్నారు. కౌలు రైతులకు జారీ చేస్తున్న సిసిఆర్సి కార్డుల ప్రయోజనాల పట్ల భూ యజమానులకు తగిన అవగాహన కల్పించాలని, ముఖ్యంగా భూ యజమానుల అంగీకారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ పద్మావతి, వ్యవసాయ శాఖ డిడి మనోహర్, ఏడి లు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *