Breaking News

తూర్పు గానుగూడెం 2019 పాప మిస్సింగ్ కేసు పై తక్షణ చర్యలకి ఆదేశం

– చట్ట వ్యతిరేకంగా చిన్నారిని పెంచుకుంటున్న వారి నుంచి పాపను చైల్డ్ కేర్ హోమ్ కు తరలింపు
– ఘటన లో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయిన ఏఎన్ఎం లు  చిక్కాల అనురాధ, పేకల గంగమ్మ లపై ఎఫ్ ఐ ఆర్ నమోదు
– తక్షణం విధుల నుంచి తొలగిస్తూ , శాఖా పరమైన చర్యల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాలు జారీ
– చట్టబద్ధత కు లోబడి, ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు పిల్లల దత్తత తీసుకోవాలి..
– ఇటువంటి ఘటనల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది , వ్యక్తుల పై పోలీసు కేసులు నమోదు చెయ్యడం జరుగుతుంది
– కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
రాజానగరం మండలం తూర్పు గానుగూడెం గ్రామంలో చట్ట వ్యతిరేకంగా, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఆడపిల్లను వేరొకరికి అప్పగించిన కేసు విషయంలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయిన వైద్య సిబ్బందిపై ఎఫ్ ఐ ఆర్ నమోదుకు ఆదేశించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజానగరం మండలం తూర్పుగానుగూడెం గ్రామానికి చెందిన ఆమె వారి కుమార్తె ను చట్ట వ్యతిరేకంగా వేరొకరికి అప్పగించడం జరిగింది అని తమకు న్యాయం చేయాలని తల్లి కోరడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. ఈ ఘటన పై వాస్తవాలు పై విచారణ చెపట్టాల్సిందిగా ఐ సి డి ఎస్ పిడి ఆదేశించడం జరిగిందన్నారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అయిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఏఎన్ఎం లు  చిక్కాల అనురాధ, పేకల గంగమ్మ లపై రాజానగరం పోలీసు స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చెయ్యడం జరిగిందని తెలిపారు. పిల్లలను దత్తత తీసుకునే క్రమములో తప్పనిసరిగా చట్ట పరిధిలో, ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు మాత్రమే చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ చట్టాలను గౌరవించాల్సిన సామాజిక బాధ్యతే కాకుండా, మార్గదర్శకాలు మేరకు మాత్రమే పిల్లలను పెంచుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇటువంటి ఘటనల్లో పాల్గొన్న, భాగస్వామ్యం అయ్యే వాటిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చెయ్యడం జరుగుతుందని హెచ్చరించారు. ఇద్దరు ఉద్యోగుల పై సెక్షన్ 363 ,  365 రీడ్ విత్ 34 ఐ పి సి 3 (2)(వివో) ఎస్సి ఎస్టి పీఓఏ యాక్ట్ ప్రకారం ఎఫ్ ఐ ఆర్ నమోదు చెయ్యడం జరిగిందనీ కలెక్టరు తెలియ చేశారు. పెంచుకున్న వారి నుంచి పాపను తీసుకుని రావడం జరిగిందనీ, రాజమహేంద్రవరం చోల్డ్ కేర్ హోం కు తరలించి సంరక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రాజ్ కుమార్ ను ఆదేశించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను దత్తత ఇచ్చే సందర్భంలో ప్రభుత్వ మార్గ దర్శకాలు పాటించాలని కలెక్టర్ ప్రశాంతి కోరారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *